అనంత్‌- రాధిక ప్రీ వెడ్డింగ్‌ ఈవెంట్‌కు బిల్‌గేట్స్‌, జుకర్ బర్గ్‌

Anant Ambani-Radhika Merchant: అనంత్‌ అంబానీ- రాధికా మర్చంట్‌ ప్రీవెడ్డింగ్‌ ఈవెంట్‌కు వివిధ దేశాల ప్రముఖులు హాజరుకానున్నారు. జుకర్‌బర్గ్‌, బిల్‌గేట్స్‌ వంటి వారు తరలిరానున్నారు.

Updated : 22 Feb 2024 18:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్‌ త్వరలో ఓ ఇంటివారు కాబోతున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త వీరేన్‌ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్‌ను (Anant Ambani-Radhika Merchant) వివాహమాడనున్నారు. 2022 డిసెంబర్‌లోనే వీరికి నిశ్చితార్థం జరగ్గా.. ఈ ఏడాది జులైలో వీరు వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. ఈ పెళ్లి వేడుక కంటే ముందు గుజరాత్‌లోని జామ్‌నగర్‌ అతిపెద్ద ఈవెంట్‌కు వేదిక కానుంది. దీనికి వివిధ దేశాలకు చెందిన అపర కుబేరులు, వివిధ కంపెనీల సీఈఓలు, పలు దేశాల రాజకీయ ప్రముఖులు రానుండటంతో సందడి వాతావరణం నెలకోనుంది.

PM Kisan: రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ నిధులు ఎప్పుడంటే?

మార్చి 1- 3 తేదీల మధ్య జామ్‌నగర్‌లోని రిలయన్స్‌ కాంప్లెక్స్‌లో అనంత్‌- రాధిక ప్రీవెడ్డింగ్‌ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌కు మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌ బర్గ్‌, మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌, అడోబ్‌ సీఈఓ శంతను నారాయణ్‌ హాజరుకానున్నారు. వీరితో పాటు బ్లాక్‌రాక్‌ సీఈఓ ల్యారీ పింక్‌, బ్లాక్‌స్టోన్‌ ఛైర్మన్‌ స్టీఫెన్‌ స్క్వార్జ్‌మ్యాన్‌, డిస్నీ సీఈఓ బాబ్‌ ఐగర్‌, ఇవాంకా ట్రంప్‌, ఖతార్‌ ప్రధాని మహ్మద్‌ బిన్‌ అబ్దుల్‌ రహమాన్‌ అల్‌థాని విచ్చేయనున్నారు. మోర్గాన్‌ స్టాన్లీ, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా, బెర్క్‌షైర్‌ హాథ్‌వే వంటి ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో పాటు.. కెనడా, స్వీడన్‌, ఆస్ట్రేలియా, బొలీవియా దేశాల మాజీ ప్రధానులు, భూటాన్‌ రాజు, రాణి తదితరులు ఈ వేడుకకు హాజరుకానున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని