PM Kisan: రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ నిధులు ఎప్పుడంటే?

PM Kisan 16th installment: పీఎం కిసాన్‌ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్‌. ఫిబ్రవరి 28వ తేదీన ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.

Published : 22 Feb 2024 15:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రైతులకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం-కిసాన్‌ (PM Kisan) పథకం 16వ విడత నిధుల (PM Kisan 16th installment) విడుదలకు తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 28న రూ.2వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. మహారాష్ట్రలోని యావత్మాల్‌ జిల్లా నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధుల్ని విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని పీఎం కిసాన్‌ అధికారిక ‘ఎక్స్‌’ (ట్విటర్‌) ఖాతాలో వెల్లడించారు. పీఎం కిసాన్‌ నిధులు అందుకోవాలంటే అర్హులైన రైతులు ఎన్‌పీసీఐ, ఆధార్‌తో అనుసంధానించిన బ్యాంకు ఖాతాను కలిగిఉండాలి. అలాగే, ఇ-కేవైసీ చేసి ఉండాలి. 

ఒకవేళ పీఎం కిసాన్‌ పథకానికి సంబంధించిన స్టేటస్ తెలుసుకోవాలన్నా, పీఎం కిసాన్‌ జాబితాలో మీ పేరు ఉందో, లేదో చూడాలన్నా https://pmkisan.gov.in/లోకి వెళ్లి చెక్‌ చేసుకోవచ్చు. ఆయా వివరాలు పొందడానికి రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌/ ఆధార్‌ నంబర్‌ ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. పీఎం కిసాన్‌ మొబైల్‌ యాప్‌ కూడా అందుబాటులో ఉంది. అలాగే, పీఎం కిసాన్‌కు సంబంధించిన ఏమైనా సందేహాలు ఉంటే 155261/011-24300606 హెల్ప్‌లైన్లను సంప్రదించొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని