WhatsApp Business: భారత్‌లో వాట్సప్‌ బిజినెస్‌ అకౌంట్స్‌కు మెటా వెరిఫైడ్‌

భారత్‌ సహా బ్రెజిల్, ఇండోనేసియా, కొలంబియా దేశాల్లోని వాట్సప్‌ బిజినెస్‌ యూజర్ల కోసం వెరిఫైడ్‌ ప్రోగ్రామ్‌ను మెటా తీసుకొచ్చింది.

Published : 07 Jun 2024 18:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లోని వాట్సప్‌ బిజినెస్‌ యూజర్ల కోసం వెరిఫైడ్‌ ప్రోగ్రామ్‌ను మెటా (meta) ప్రారంభించింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టా గ్రామ్‌లో ప్రస్తుతం ఈ వెరిఫికేషన్‌ ఆప్షన్‌ ఉంది. అలాగే, వాట్సప్‌ బిజినెస్‌ యాప్‌ వాడే వారి కోసం గతేడాది సెప్టెంబర్‌లోనే మెటా వెరిఫైడ్‌ ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది. తాజాగా భారత్‌ సహా బ్రెజిల్, ఇండోనేసియా, కొలంబియా దేశాల్లోని వాట్సప్‌ బిజినెస్‌ యూజర్ల కోసం దీన్ని అందుబాటులోకి తెచ్చింది. 

అందరికీ సుపరిచితమైన బ్లూటిక్‌నే వెరిఫైడ్‌గా పేర్కొంటారు. ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లో తరహాలోనే మర్చంట్స్‌ తమ వాట్సప్‌ బిజినెస్‌ అకౌంట్‌కు మెటా వెరిఫైడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని తీసుకున్నవారికి బ్లూటిక్‌ను జారీ చేస్తారు. దీనివల్ల ఈ బిజినెస్‌ నేమ్‌తో వేరొకరు ఖాతా తెరవకుండా రక్షణ కల్పించడంతోపాటు, మార్కెటింగ్‌ అవసరాల కోసం వాట్సప్‌ ఛానెల్‌ను కూడా మెటా అందిస్తుంది.

సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్న వాట్సప్‌ బిజినెస్‌ యూజర్లు వివిధ డివైజుల నుంచి లాగిన్‌ అవ్వడానికి వీలుంటుంది. దీంతోపాటు కస్టమర్లకు, వెండర్లకు కనిపించేలా వ్యాపార వివరాలతో కూడిన కస్టమ్‌ వెబ్‌పేజీని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. వ్యక్తిగత ఫోన్‌ నంబర్‌ను ఇవ్వకుండానే కస్టమర్ సపోర్ట్‌కు నేరుగా కాల్‌ చేసుకునే సదుపాయంపై మెటా ప్రస్తుతం పనిచేస్తోంది. అలాగే, కామన్‌ క్వశ్చన్లకు మానవ ప్రమేయం లేకుండా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా సమాధానం ఇచ్చేలా కొత్త టూల్‌ను మెటా సైతం అభివృద్ధి చేస్తోంది. భవిష్యత్‌లో వెరిఫైడ్‌ బ్యాడ్జ్‌ కోసం మెటా కొంత మొత్తాన్ని వసూలు చేయనుంది. అయితే, ఎంత మొత్తం అనేది మాత్రం వెల్లడించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని