Elon Musk: ‘నా ఫోన్‌ నంబర్‌ వాడటం ఆపేస్తా’: ఎలాన్ మస్క్‌ పోస్టు

కొద్ది రోజుల్లో తన ఫోన్‌ నంబర్‌ వాడటాన్ని ఆపివేస్తానని ఎలాన్‌ మస్క్‌(Elon Musk) అన్నారు. 

Published : 10 Feb 2024 02:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎక్స్‌(ట్విటర్) అధినేత ఎలాన్‌ మస్క్‌(Elon Musk) వినూత్న నిర్ణయాలు తీసుకుంటూ దూసుకెళ్తుంటారు. తాజాగా ఒక కీలక ప్రకటన చేశారు. త్వరలో తాను ఫోన్‌ నంబర్ వాడటం ఆపేస్తానని చెప్పారు. ‘కొన్ని నెలల్లో నేను నా ఫోన్‌ నంబర్‌ వాడటం నిలిపేస్తాను. సందేశాలు పంపేందుకు, ఆడియో, వీడియో కాల్స్‌కు ఎక్స్‌ను మాత్రమే ఉపయోగిస్తాను’ అని పోస్టు పెట్టారు. ఎక్స్‌లో ఆడియో/వీడియో కాల్స్‌ ఫీచర్‌ను ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగానే మస్క్‌(Musk) నుంచి ఈ ప్రకటన వచ్చినట్లు కనిపిస్తోంది.

ఉద్యోగులను ఏఐ ఇప్పట్లో భర్తీ చేస్తుందా? ఎంఐటీ ఆసక్తికర నివేదిక!

గత ఏడాది అక్టోబర్‌లో ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. ‘ఎక్స్‌’ ప్లాట్‌ఫామ్‌ను ‘ఎవ్రీథింగ్ యాప్’ గా మార్చటంలో భాగంగానే దానిని తీసుకువస్తున్నట్లు మస్క్ అంతకుముందే ప్రకటించారు. దాని సాయంతో ఫోన్‌ నంబర్‌ లేకుండానే ‘ఎక్స్‌’లో కాల్స్‌ మాట్లాడవచ్చు. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌, మ్యాక్‌, పీసీలు ఈ కాలింగ్‌ ఫీచర్‌ను సపోర్ట్‌ చేస్తాయి.

మస్క్‌ను కొనియాడిన పుతిన్‌..

ఉక్రెయిన్‌ యుద్ధం మొదలైన తర్వాత అమెరికాకు చెందిన ఫాక్స్‌ న్యూస్‌ ప్రజెంటర్‌ టకర్‌ కార్ల్‌సన్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్‌(Putin) సుదీర్ఘ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మస్క్‌ను కొనియాడారు. ఆయన్ను స్మార్ట్‌ పర్సన్ అన్నారు. ఏఐ, న్యూరాలింక్ గురించి ప్రశ్నించగా.. ప్రశ్నలు చాలా క్లిష్టంగా ఉన్నాయంటూ చమత్కరించారు. మనిషి మెదడులో ఎలక్ట్రానిక్‌ చిప్‌ అమర్చామని న్యూరాలింక్ వ్యవస్థాపకుడు మస్క్‌ చేసిన ప్రకటనపై అధ్యక్షుడు మాట్లాడుతూ.. ‘ఆయనకు అడ్డు లేదు’ అని వ్యాఖ్యానించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని