సెప్టెంబర్ నుంచి కొత్త టెలికాం నిబంధనలు.. రానున్న మార్పులివే..!

Telecom rules: సైబర్‌ మోసాలు పెరుగుతున్న తరుణంలో వాటికి అడ్డుకట్టే వేసే చర్యల్లో భాగంగా టెలికాం రంగంలో కొత్త నిబంధనలు తీసుకురావాలని డాట్‌ చూస్తోంది.

Published : 23 May 2024 00:03 IST

Telecom rules | ఇంటర్నెట్‌డెస్క్‌: టెలికాం రంగంలో కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. టెలికమ్యూనికేషన్స్‌ చట్టం 2023లో తీసుకొచ్చిన నిబంధనలను డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌ (DoT) త్వరలో అమలు చేయనుంది. ఈ విషయంపై డాట్‌కు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) గతంలో సిఫార్సు చేసింది. ఈ మార్పులు లోక్‌సభ ఎన్నికల తర్వాత అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం.

నకిలీ సిమ్‌ కార్డ్‌లు, సైబర్‌ మోసాలు విజృంభిస్తున్న తరుణంలో వీటిని నిరోధించడానికి కొత్త రూల్స్‌ ఉపయోగపడనున్నాయి. దీని ప్రకారం.. కొత్త కనెక్షన్‌ను అందించాలంటే తప్పనిసరిగా బయోమెట్రిక్‌ గుర్తింపు తప్పనిసరి. అటువంటి సున్నితమైన సమాచారాన్ని సేకరించడంలో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా టెలికాం కంపెనీలకు స్పష్టమైన మార్గదర్శకాలు డాట్‌ జారీ చేయనుంది. వీటితో పాటు స్పెక్ట్రమ్‌ కేటాయింపులు, శాటిలైట్‌ కమ్యూనికేషన్‌కు సంబంధించిన నిబంధనలు తీసుకురానున్నారు. దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించాలంటే.. సదరు కంపెనీలు ప్రభుత్వం నుంచి స్పెక్ట్రమ్ కొనుగోలు చేయాల్సిఉంటుంది.

కేంద్రానికి ఆర్‌బీఐ ‘డబుల్‌’ బొనాంజా.. డివిడెండ్‌ కింద ₹2.11 లక్షల కోట్లు

టెలికమ్యూనికేషన్స్ చట్టంలోని వివిధ సెక్షన్లలో పేర్కొన్న నిబంధనలను సెప్టెంబర్ 15 నాటికి అమల్లోకి తీసుకురావాలని డాట్‌ లక్ష్యంగా పెట్టుకుంది. టెలికాం రంగంలో నియమ, నిబంధనలకు సంబంధించి చాలా ఏళ్లుగా కొనసాగుతున్న ఇండియన్‌ టెలిగ్రాఫ్‌ చట్టం, ఇండియన్‌ వైర్‌లెస్‌ టెలిగ్రాఫ్‌ చట్టం, టెలిగ్రాఫ్‌ వైర్స్‌ చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది. భారత పార్లమెంటు 2023 డిసెంబరు 20న టెలికమ్యూనికేషన్స్‌ బిల్లు 2023 (Telecom Act 2023)ని ఆమోదించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని