WhatsApp: వాట్సప్‌ ఛానెల్స్‌లో కొత్త ఫీచర్‌.. ఎలా పనిచేస్తుందంటే?

WhatsApp: ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌.. ఛానెల్స్‌లో కొత్త ఫీచర్‌ని తీసుకొచ్చింది. ఛానెట్‌ ఓనర్‌షిప్‌ సులువుగా వేరొకరికి బదిలీ చేసేందుకు ఇది సాయపడనుంది.

Published : 19 Feb 2024 02:03 IST

WhatsApp | ఇంటర్నెట్‌డెస్క్‌: ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో యూజర్ల ముందుకు వచ్చే వాట్సప్‌ (WhatsApp).. గతేడాది ఛానెల్స్‌ (WhatsApp Channels)ను పరిచయం చేసింది. ప్రస్తుతం దాన్ని విస్తరించే పనిలో పడింది. అందులో భాగంగానే ఛానెల్‌ ఓనర్‌షిప్‌ను మరొకరికి బదిలీ చేసే సదుపాయం తీసుకొచ్చింది. వాట్సప్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ అందించే ‘వాబీటా ఇన్ఫో’ తన బ్లాగ్‌లో ఈ విషయాన్ని పంచుకుంది.

వాట్సప్‌ తీసుకొచ్చిన కొత్త ఫీచర్‌ సాయంతో ఛానెల్‌ నిర్వహిస్తున్న వ్యక్తి తన ఓనర్‌షిప్‌ను వేరొకరికి బదిలీ చేసేయొచ్చు. అంటే ప్రస్తుత ఛానెల్‌ యజమాని, అర్హత ఉన్న వినియోగదారుల జాబితా నుంచి కొత్త యజమానిని ఎంచుకొని బదిలీ ప్రక్రియ ప్రారంభించొచ్చు. కొత్త ఓనర్‌ బదిలీ అభ్యర్థనను అంగీకరిస్తే చాలు ఛానెల్‌ పూర్తి నిర్వాహణ హక్కులు పొందుతాడు. ఈ కొత్త ఫీచర్‌తో యూజర్‌ తమ ఛానెల్‌లపై మరింత నియంత్రణను కలిగి ఉంటారు. ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ బీటా యూజర్లకు ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది, త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని