Nirmala sitharaman: బడ్జెట్‌లో ‘అద్భుతాలు’ ఉండకపోవచ్చు: నిర్మల సీతారామన్‌

Nirmala sitharaman on Budget: వచ్చే బడ్జెట్‌లో కీలక ప్రకటనలు ఏవీ ఉండకపోవచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ కావడమే ఇందుకు కారణమన్నారు.

Updated : 07 Dec 2023 15:17 IST

Nirmala sitharaman | దిల్లీ: సార్వత్రిక సమరానికి సెమీ ఫైనల్స్‌గా భావించే ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. ఇక 2024 లోక్‌సభ ఎన్నికలకు ఉన్నది ఆరు నెలలు మాత్రమే. వరుసగా మూడోసారి అధికారం చేపట్టాలని చూస్తున్న మోదీ సర్కారు.. ఎన్నికలకు ముందు జనాకర్షక పథకాలు, తాయిలాలు ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు బడ్జెట్‌లో కీలక ప్రకటనలు చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్‌లో అలాంటి ‘అద్భుత ప్రకటనలు’ ఏవీ ఉండకపోవచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala sitharaman) అన్నారు.

యూపీఐ, బ్యాంకింగ్‌ మోసాలు.. పోయిన డబ్బు తిరిగి పొందొచ్చా?

సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్‌ ఎకనమిక్‌ పాలసీ ఫోరమ్‌ సదస్సులో నిర్మలా సీతారామన్‌ పాల్గొని మాట్లాడారు. ఎన్నికల సమయం కావడంతో ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టేది ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ మాత్రమేనని, ప్రభుత్వ ఖర్చుల కోసం మాత్రమే ఈ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నామని చెప్పారు. కాబట్టి ఈ సారి బడ్జెట్‌లో అద్భుతమైన ప్రకటనలు ఉండకపోవచ్చని ఆర్థిక మంత్రి చెప్పారు. కీలక ప్రకటనల కోసం కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రవేశపెట్టే బడ్జెట్‌ వరకు వేచి చూడాలన్నారు. సాధారణంగా ఏటా ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెడుతుంటుంది. 2024 వేసవిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సారి ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. బ్రిటీష్‌ కాలం నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు