Smart watches: SOS సదుపాయంతో నాయిస్ రెండు కొత్త వాచ్‌లు

Noise Smart watches: ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ నాయిస్‌ SOS కనెక్టివిటీతో రెండు సరికొత్త స్మార్ట్‌వాచ్‌లను భారత మార్కెట్లో లాంచ్‌ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి...

Published : 30 Nov 2023 01:56 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ నాయిస్‌ (Noise) తన ‘ప్రో 5’ సిరీస్‌లో రెండు కొత్త వాచ్‌లను భారత మార్కెట్‌లో లాంచ్‌ చేసింది. నాయిస్‌ కలర్‌ఫిట్‌ ప్రో 5 (Noise ColorFit Pro 5), నాయిస్‌ కలర్‌ఫిట్ ప్రో 5 మ్యాక్స్‌ (Noise ColorFit Pro 5 Max) పేరుతో సరికొత్త స్మార్ట్‌వాచ్‌లను తీసుకొచ్చింది. ఎస్‌ఓఎస్‌ కనెక్టివిటీతో వచ్చే ఈ వాచ్‌లు అనేక రంగుల్లో లభిస్తాయని కంపెనీ పేర్కొంది.

నాయిస్‌ కలర్‌ఫిట్‌ ప్రో 5 రెండు వేరియంట్లలో వస్తోంది. బేస్‌ వేరియంట్ ధర రూ.3,999 కాగా.. ఎలైట్‌ ఎడిషన్‌ ధర రూ.4,999గా కంపెనీ నిర్ణయించింది. జెట్‌ బ్లాక్‌, ఎలైట్‌ బ్లాక్‌, ఎలైట్‌ రోస్‌ గోల్డ్‌, ఆలివ్‌ గ్రీవ్‌, రెయిన్‌బో వేవ్‌, గోల్డ్‌ రంగుల్లో లభిస్తుంది. 1.85 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేతో ఈ వాచ్‌ ఉంటుంది. దుమ్ము, నీరు చేరకుండా IP67 రేటింగ్‌ ఇచ్చారు. ఇందులో హార్ట్‌రేట్‌, SpO2, స్లీప్‌ మానిటరింగ్‌ వంటి హెల్త్‌ ట్రాకర్స్‌ ఉన్నాయి. వందకు పైగా స్పోర్ట్స్ మోడ్స్‌, ఫిట్‌నెస్‌ యాక్టివిటీ ట్రాకర్లను కూడా ఇచ్చారు. డైలీ రిమైండర్‌, వెదర్‌ అప్‌డేట్‌ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే ఏడు రోజుల పాటు వస్తుందని కంపెనీ వెల్లడించింది. ఎస్‌ఓఎస్‌ (SOS)కు సపోర్ట్‌ చేస్తుంది. బ్లూటూత్‌ 5.3 కనెక్టివిటీ కూడా ఉంది.

ఎల్‌ఐసీ కొత్త పాలసీ.. ఐదేళ్లు కడితే జీవితాంతం ఆదాయం

నాయిస్‌ కలర్‌ఫిట్ ప్రో 5 మ్యాక్స్‌ కూడా రెండు వేరియంట్లలో లభిస్తోంది. బేస్‌ వేరియంట్‌ ధర రూ.4,999 కాగా.. ఎలైట్ ఎడిషన్‌ ధర రూ.5,999 గా కంపెనీ నిర్ణయించింది. జెట్‌ బ్లాక్, స్పేస్ బ్లూ, క్లాసిక్‌ బ్లాక్‌, క్లాసిక్‌ బ్రౌన్‌, ఎలైట్‌ బ్లాక్‌, ఎలైట్‌ సిల్వర్, సేజ్‌ గ్రీన్‌, షాడో బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. 1.96 అంగుళాల అమోల్డ్‌ డిస్‌ప్లేతో వస్తోంది. నాయిస్‌ కలర్‌ఫిట్‌ ప్రో 5 వాచ్‌లోని ఫీచర్లే ఇందులోనూ ఉన్నాయి. లెధర్‌, సిలికాన్‌, నైలాన్‌, మెటల్‌ స్ట్రాప్స్‌తో ఈ రెండు వాచ్‌లను తీసుకొచ్చారు. నాయిస్‌ వెబ్‌సైట్‌, అమెజాన్‌, మింత్రాతో పాటూ రిటైల్‌ దుకాణాల్లో కొనుగోలు చేయవచ్చని కంపెనీ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు