NoiseFit Origin: 7 రోజుల బ్యాటరీ లైఫ్‌తో నాయిస్‌ ప్రీమియం స్మార్ట్‌వాచ్‌.. ధర, ఫీచర్లివే..

NoiseFit Origin: నాయిస్‌ ఫిట్‌ ఆరిజిన్‌ అనే కొత్త స్మార్ట్‌వాచ్‌ మార్కెట్లోకి వచ్చింది. అత్యాధునిక ఫీచర్లు, ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ఫోన్‌ ధర, ఇతర వివరాలు చూద్దాం..

Published : 06 Jun 2024 12:10 IST

NoiseFit Origin | ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశీయ స్మార్ట్‌ గ్యాడ్జెట్స్‌ తయారీ సంస్థ నాయిస్‌ ఇండియా మరో కొత్త వాచ్‌ను విడుదల చేసింది. నాయిస్‌ఫిట్‌ ఆరిజిన్‌ (NoiseFit Origin) పేరిట తీసుకొచ్చిన ఈ ప్రీమియం గ్యాడ్జెట్‌ పలు లైఫ్‌స్టైల్‌ ఫీచర్లను అందిస్తోంది. కొత్త చిప్‌సెట్‌, యూజర్‌ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్‌తో అత్యాధునికంగా తీర్చిదిద్దినట్లు కంపెనీ చెబుతోంది.

నాయిస్‌ఫిట్‌ ఆరిజిన్‌ స్మార్ట్‌వాచ్‌.. జెట్‌ బ్లాక్‌, సిల్వర్‌ గ్రే, మిడ్‌నైట్‌ బ్లాక్‌, మొజాక్‌ బ్లూ, క్లాసిక్‌ బ్లాక్‌, క్లాసిక్‌ బ్రౌన్ రంగుల్లో అందుబాటులో ఉంది. దీని ధర (NoiseFit Origin Price) రూ.6,500. గోనాయిస్‌.కామ్‌ సహా క్రోమా స్టోర్లలో కొనుగోలు చేయొచ్చు. జూన్ 7 నుంచి అందుబాటులోకి రానుంది. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లోనూ కొనొచ్చు.

ఈ వాచ్‌లో బీపీ, హార్ట్‌రేట్‌, బ్లడ్‌ ఆక్సిజన్‌ లెవెల్‌, ఫీమేల్‌ సైకిల్‌, స్లీప్‌, స్ట్రెస్‌ ట్రాకర్లు సహా ఆరోగ్యాన్ని పర్యవేక్షించే ఫీచర్లను (NoiseFit Origin Features) మరింత మెరుగుపర్చినట్లు నాయిస్‌ వెల్లడించింది. దీంట్లో 1.46 అంగుళాల అపెక్స్‌విజన్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను అమర్చారు. ఈఎన్‌ 1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. క్రితం వెర్షన్లతో పోలిస్తే ఈ ప్రాసెసర్‌ 30 శాతం వేగంగా ఉంటుందని తెలిపింది. నెబ్యులా యూఐతో వస్తోంది. చేతిని తిప్పడం ద్వారా కాల్స్‌ను మ్యూట్‌ చేసే ఆప్షన్‌ను ఇచ్చారు. బ్లూటూత్‌ 5.3 కనెక్టివిటీ ఉంది. బ్యాటరీ లైఫ్‌టైమ్‌ ఏడు రోజుల వరకు ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు