Nokia 3210 4G: 25 ఏళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చిన నోకియా 3210.. ఫీచర్లు ఇవే..

Nokia 3210 4G: నోకియా 3210 ఫోన్‌ భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. దీని ధరను రూ.3,999గా కంపెనీ నిర్ణయించింది.

Published : 11 Jun 2024 00:06 IST

Nokia 3210 4G | ఇంటర్నెట్‌ డెస్క్‌: నోకియా (Nokia) బ్రాండ్‌పై ఫోన్లు తయారుచేసే హెఎండీ గ్లోబల్‌ సంస్థ.. నోకియా 3210 4జీ (Nokia 3210 4G) ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 25 ఏళ్ల క్రితం లాంచ్‌ అయిన ఈ మోడల్‌ మరోసారి నోకియా ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ ఫోన్‌ ధరను రూ.3,999గా నిర్ణయించారు. అమెజాన్‌, హెచ్‌ఎండీ ఈ స్టోర్‌ వెబ్‌సైట్లలో కొనుగోలు చేయొచ్చు. మరోసారి అదే రెట్రో లుక్‌ను కొనసాగించారు. నీలం, పసుపు, నలుపు రంగుల్లో ఈ ఫోన్‌ లభిస్తుంది.

ఇక ఫీచర్ల విషయానికొస్తే. ఇందులో 2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లే ఉంటుంది. యునిసోక్‌ టీ107 ప్రాసెసర్‌ అమర్చారు. వెనకవైపు 2 ఎంపీ కెమెరా అమర్చారు. 64 ఎంబీ ర్యామ్‌ ఇచ్చారు. యూట్యూబ్‌, యూట్యూబ్‌ షార్ట్స్‌, న్యూస్‌, గేమ్స్‌ కోసం వేర్వేరుగా యాప్స్‌ ఇచ్చారు. స్నేక్‌ గేమ్‌ను కొనసాగించారు. ఈ ఫోన్‌లో 1450 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. యూఎస్‌బీ టైప్‌-సి పోర్టుతో వస్తుండడం గమనార్హం. 3.5 ఎంఎం జాక్, ఎంపీ3 ప్లేయర్‌, ఎఫ్‌ఎం రేడియో, డ్యూయల్‌ సిమ్‌ 4జీ voLTE సపోర్ట్‌తో ఈ ఫోన్‌ వస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని