BSNL Cinemaplus: రూ.49కే బీఎస్ఎన్‌ఎల్‌ సినిమాప్లస్‌ సబ్‌స్క్రిప్షన్‌

BSNL Cinemaplus: బీఎస్‌ఎన్‌ఎల్‌ సినిమాప్లస్‌ పేరిట ఓటీటీ ప్యాకేజీలను అందిస్తోంది. దీంట్లో మొత్తం మూడు ప్యాక్‌లు ఉన్నాయి. తాజాగా స్టార్టర్ ప్యాక్ ధరను సంస్థ కుదించింది.

Updated : 28 Apr 2024 15:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ తమ ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సబ్‌స్క్రైబర్లకు అందించే సినిమాప్లస్‌ (BSNL Cinemaplus) ఓటీటీ ప్యాకేజీ ప్రారంభ ధరను తగ్గించింది. స్టార్టర్ ప్యాక్‌ కోసం గతంలో నెలకు రూ.99 వసూలు చేయగా.. దాన్ని తాజాగా రూ.49కు కుదించింది. దీంట్లో లయన్స్‌గేట్‌, షెమరూమీ, హంగామా, ఎపిక్‌ ఆన్‌ ఓటీటీల్లోని కంటెంట్‌ను ఎంజాయ్‌ చేయొచ్చు.

దీనితో పాటు బీఎస్‌ఎన్‌ఎల్‌ మరో రెండు ప్లాన్లను కూడా అందిస్తోంది. రూ.49తో వచ్చేది స్టార్టర్‌ ప్యాక్‌ మాత్రమే. జీ5, సోనీలివ్‌, యప్‌టీవీ, డిస్నీ+ హాట్‌స్టార్‌తో కూడిన ఫుల్‌ ప్యాక్ ఓటీటీ ప్యాకేజీ కూడా ఉంది. దీని ధర నెలకు రూ.199.

రూ.249తో బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రీమియం ప్లాన్‌ను కూడా ఇస్తోంది. దీంట్లో జీ5, సోనీ లివ్‌, డిస్నీ+ హాట్‌స్టార్‌, యప్‌టీవీ, లయన్స్‌గేట్‌, షెమరూమీ, హంగామా, వంటి ఓటీటీలను ఎంజాయ్‌ చేయొచ్చు. సినిమాప్లస్‌ సబ్‌స్క్రిప్షన్‌తో ఒకే లాగిన్‌తో వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు యాక్సెస్‌ లభిస్తుంది. ఎక్స్‌ట్రీమ్‌ ప్లే పేరిట ఎయిర్‌టెల్‌, జియోటీవీ ప్రీమియం పేరిట జియో, టాటా ప్లే బింజ్‌తో టాటా సైతం ఈ తరహా ప్యాకేజీలను అందిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని