Ola solo: ఓలా నుంచి సెల్ఫ్‌ డ్రైవింగ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. రియలా? ఫేకా?

Ola solo: ఓలా నుంచి త్వరలో సెల్ఫ్‌ డ్రైవింగ్‌ స్కూటర్‌ రాబోతోంది. దీనిపై తాము పని చేస్తున్నట్లు ఆ కంపెనీ సీఈఓ భవీశ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు.

Published : 02 Apr 2024 19:02 IST

Ola solo | ఇంటర్నెట్ డెస్క్‌: ఓలా మరో వినూత్న ఆవిష్కరణతో ముందుకొస్తోంది. ఓలా సోలో (Ola solo) పేరిట ప్రపంచంలోనే తొలి అటానమస్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను టీజ్‌ చేసింది. ఏఐ సాయంతో ఈ స్కూటర్‌ పని చేస్తుందని ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ భవీశ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఏప్రిల్‌ 1న విడుదల చేశారు.

సాధారణంగా ఏప్రిల్‌ 1న చాలా కంపెనీలు ఫూల్‌ చేయడం కోసం కొన్ని వీడియోలను విడుదల చేస్తుంటాయి. ఓలా కూడా అదేతరహాలో ఏప్రిల్‌ ఫూల్‌ వీడియోను విడుదల చేసిందని చాలామంది భావించారు. దీనిపై మంగళవారం (ఏప్రిల్‌ 2న) భవీశ్‌ మరో ట్వీట్‌లో వివరణ ఇచ్చారు. అంతకుముందు పోస్ట్ చేసిన వీడియోను చాలామంది ఏప్రిల్‌ ఫూల్స్ జోక్‌ అని భావించారన్నారు. వాస్తవానికి ఆ వీడియోను సరదా కోసమే రూపొందించినా.. ఈ టెక్నాలజీపై తమ బృందం పని చేస్తోందని భవీశ్‌ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ప్రోటోటైప్‌ సిద్ధం చేసినట్లు పేర్కొంటూ తాజాగా మరో వీడియోను పోస్ట్‌ చేశారు.

ఏసీ కొంటున్నారా? ఇవి తెలుసుకోండి..!

టూవీలర్‌లో కూడా అటానమస్‌, సెల్ఫ్‌ బ్యాలెన్సింగ్‌ టెక్నాలజీని తీసుకొచ్చేందుకు కృషి జరుగుతోందని భవీశ్‌ చెప్పారు. భవిష్యత్‌లో మా నుంచి రాబోయే ఉత్పత్తుల్లో ఈ సాంకేతికతను చూడొచ్చు అంటూ భవీశ్‌ పేర్కొన్నారు. ఈ వీడియోను పోస్ట్‌ చేసిన కొన్ని గంటల్లోనే 4 లక్షల వ్యూస్‌ లభించాయి. ఒకవేళ అదే జరిగితే భారత మార్కెట్లో ఓలాను ఎవరూ టచ్‌ చేయలేరంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ పెట్టారు. దీనివల్ల ప్రయోజనం ఉంటుందా? అంటూ కొందరు సందేహం వ్యక్తంచేస్తున్నారు. స్కూటర్ల నాణ్యతపైనా దృష్టి పెట్టాలని మరో యూజర్‌ కామెంట్ పెట్టారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని