OnePlus 12: స్నాప్‌డ్రాగన్‌ లేటెస్ట్‌ ప్రాసెసర్‌తో వన్‌ప్లస్‌ 12.. ఇండియాలో ఎప్పుడంటే?

OnePlus 12: వన్‌ప్లస్‌ 12 ప్రస్తుతానికి చైనా మార్కెట్‌లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా జనవరిలో విడుదల కానుంది.

Updated : 06 Dec 2023 13:19 IST

OnePlus 12 | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్‌ మరో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. వన్‌ప్లస్‌ 12 (OnePlus 12) పేరిట తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను తొలుత చైనా మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. క్వాల్‌కామ్‌కు చెందిన సరికొత్త చిప్‌సెట్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3తో వస్తున్న తొలి వన్‌ప్లస్‌ ఫోన్‌ ఇదే. 50 మెగాపిక్సెల్‌ కెమెరా, 24జీబీ ర్యామ్‌, 1టీబీ వరకు స్టోరేజ్‌ వంటి ఫీచర్లతో ఈ ఫోన్‌ మార్కెట్‌లోకి వస్తోంది.

12జీబీ ర్యామ్‌ + 256జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ వన్‌ప్లస్‌ 12 ఫోన్‌ ధర (OnePlus 12 Price) చైనాలో CNY 4,299 (దాదాపు రూ.50,700). 16జీబీ ర్యామ్‌ + 512 జీబీ వేరియంట్‌ ధర CNY 4,799 (దాదాపు రూ.56,600) కాగా.. 16జీబీ ర్యామ్‌ + 1టీబీ వేరియంట్‌ ధర CNY 5,299 (దాదాపు రూ.62,500). దీంట్లో 24 జీబీ ర్యామ్‌ 1 టీబీ స్టోరేజ్‌తో వస్తున్న టాప్‌ మోడల్‌ ధరను CNY 5,799 (రూ.68,400)గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ 2024 జనవరిలో భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే అవకాశం ఉంది.

వన్‌ప్లస్ 12 (OnePlus 12) ఫోన్‌.. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత కలర్‌ఓఎస్‌ 14తో వస్తోంది. 4,500 నిట్స్‌ బ్రైట్‌నెస్‌, 120Hz వరకు రీఫ్రెష్‌ రేట్‌తో కూడిన 6.82 అంగుళాల క్వాడ్‌ హెచ్‌డీ+ ఎల్‌టీపీఓ ఓలెడ్ స్క్రీన్‌ను అమర్చారు. 4ఎన్‌ఎం స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3 ప్రాసెసర్‌ను ఇస్తున్నారు. వెనుకభాగంలో 50 మెగాపిక్సెల్‌ ప్రధాన కెమెరా.. సెల్ఫీల కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్‌ కెమెరాను పొందుపర్చారు. 

5జీ, 4జీ ఎల్‌టీఈ, వైఫై 7, బ్లూటూత్‌ 5.4, జీపీఎస్‌, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్‌ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. గైరోస్కోప్‌, యాక్సెలరోమీటర్‌, ప్రాగ్జిమిటీ సెన్సర్‌, బయోమెట్రిక్‌ అథెంటిఫికేషన్‌ కోసం అండర్‌ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌ను ఇచ్చారు. 100వాట్‌ SuperVOOC ఛార్జింగ్‌ సపోర్ట్‌తో కూడిన 5,400 ఎంఏహెచ్‌ బ్యాటరీని అమర్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు