Oneplus 12: రిలీజ్‌కు ముందే వన్‌ప్లస్‌ 12 లుక్‌ లీక్‌ (pics)

Oneplus 12: వన్‌ప్లస్‌ 12 ఫోన్‌ చైనాలో డిసెంబర్‌ 4న రిలీజ్ కానుంది. విడుదలకు ముందు దీనికి సంబంధించిన చిత్రాలు బయటకొచ్చాయి.

Published : 27 Nov 2023 13:14 IST

Oneplus 12 look | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ వన్‌ప్లస్‌ (Oneplus) నుంచి త్వరలో విడుదల కాబోతున్న ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ వన్‌ప్లస్‌ 12 (Oneplus 12). ఈ ఫోన్‌ వనప్లస్‌ 10వ వార్షికోత్సవం సందర్భంగా డిసెంబర్‌ 4న చైనాలో విడుదల చేయనున్నారు. అయితే, విడుదలకు ముందే ఈ ఫోన్‌కు సంబంధించిన అఫీషియల్‌ చిత్రాలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోన్‌ పేల్‌ గ్రీన్‌, రాక్‌ బ్లాక్‌, వైట్‌ కలర్స్‌లో రానుంది. ప్రపంచవ్యాప్తంగా జనవరిలో ఈ ఫోన్‌ లాంచ్‌ చేసే అవకాశం ఉంది.

ఈ ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్‌ ఉంది. పెరీస్కోప్‌ జూమ్‌ లెన్స్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. వన్‌ప్లస్ 12లో 64 మెగాపిక్సల్‌ పెరీస్కోప్‌ టెలీఫొటో లెన్స్‌ ఇస్తున్నట్లు గతంలో వన్‌ప్లస్‌ చైనా ప్రెసిడెంట్‌ లీజీ ఓ సందర్భంలో పేర్కొన్నారు. దీనికి అదనంగా 50 ఎంపీ సోనీ ఓఐఎస్‌ కెమెరా, 50 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్‌ సెన్సర్‌ కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది. ముందువైపు  32 ఎంపీ కెమెరా ఇవ్వనున్నారని సమాచారం. హైక్వాలిటీ ఇమేజులను తీయడంలో ఈ కెమెరాలు సాయపడనున్నాయి. అలాగే లేటెస్ట్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జనరేషన్‌ 3 ప్రాసెసర్‌ను వినియోగించినట్లు సమాచారం. 2కె బ్యాటరీ, 2600 నిట్స్‌ బ్రైట్‌నెస్‌తో ఈ ఫోన్‌ వస్తున్నట్లు సమాచారం. ఇతర ఫీచర్ల కోసం మరో వారం రోజులు వెయిట్‌ చేయాల్సిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని