OnePlus: వన్‌ప్లస్‌ ఏఐ మ్యూజిక్‌ స్టూడియో.. నిమిషాల్లో కొత్త పాట రెడీ

OnePlus AI Music Studio: మ్యూజిక్‌ డైరెక్టర్‌తో పనిలేకుండా, లిరిక్స్‌ రాయడం రాకున్నా సులువుగా టూల్‌ సాయంతో పాటను జెనరేట్‌ చేయొచ్చని తెలుసా?వన్‌ప్లస్‌ స్టూడియో ఆ సౌకర్యం కల్పిస్తోంది.

Updated : 21 Nov 2023 19:02 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒక కొత్త పాటను ప్రజల్లోకి తీసుకురావాలంటే అంత సులువు కాదు. పాట రచయిత, దానికి సంగీతం సమకూర్చే మ్యూజిక్‌ డైరెక్టర్‌, పాటను ఆలపించే గాయకుడు.. ఇలా ఇంతమంది కష్టపడితే గానీ ఒక పాటను రిలీజ్‌ చేయటం కుదరదు. ఒకవేళ మీరే సొంతంగా పాటను రూపొందించాలంటే ఇంత కష్టపడాల్సిన పనిలేదు. కేవలం ఒక టూల్‌ సాయంతో సులువుగా పాటను రూపొందించొచ్చు. అదెలా అనుకుంటున్నారా?

యూజర్లే సొంతంగా పాటను క్రియేట్‌ చేసుకొనేందుకు వీలుగా వన్‌ప్లస్‌ (OnePlus) ఏఐ మ్యూజిక్‌ స్టూడియోను (OnePlus AI Music Studio) ఆవిష్కరించింది. దీని సాయంతో సొంతంగా పాటలు క్రియేట్‌ చేసుకోవచ్చని తెలిపింది. కేవలం కొన్ని ప్రాంప్ట్‌ అందించి మ్యూజిక్‌ రకాన్ని ఎంపిక చేసుకుంటే చాలు నిమిషాల్లో పాటను కంపోజ్‌ చేసేస్తుందని వెల్లడించింది. ఏఐ రూపొందించిన మ్యూజిక్‌ల ఆధారంగా సరికొత్త పాట జనరేట్‌ అవుతుంది. మ్యూజిక్‌ స్టూడియో ఆవిష్కరణ సందర్భంగా వన్‌ప్లస్ మార్కెటింగ్ డైరెక్టర్ ఇషితా గ్రోవర్ మాట్లాడుతూ.. మ్యూజిక్‌ స్టూడియో కేవలం ఒక టూల్‌ మాత్రమే కాదని.. సాంకేతికత, సృజనాత్మకతల అసమాయమైన కలయిక అన్నారు. యూజర్లలోని కళాకారుడిని వెలికితేసే అవకాశాన్ని ఇది కల్పిస్తుందని వెల్లడించారు.

ఎలా రూపొందించాలంటే..?

  •  దీని కోసం వన్‌ప్లస్‌ ఏఐ మ్యూజిక్‌ స్టూడియో వెబ్‌సైట్‌లో ఇ-మెయిల్‌, పేరు, ఓటీపీ సాయంతో అకౌంట్‌ని క్రియేట్‌ చేసుకొని సైన్‌-ఇన్‌ అవ్వాల్సి ఉంటుంది.
  •  తర్వాత స్క్రీన్‌ పై కనిపించే మోడ్‌, జానర్, మ్యూజిక్‌ వీడియో థీమ్‌లలో మీకు నచ్చిన దాన్ని ఎంపిక చేసుకోండి.
  •  మీరు ఏ సందర్భానికి తగినట్టుగా పాటను క్రియేట్‌ చేయాలనుకుంటున్నారో తదనుగుణమైన పదాలు, వాక్యాలను ఎంటర్‌ చేయాలి. ఆపై click on generateపై క్లిక్‌ చేయాలి.
  •  మీ పదాల ఆధారంగా ఏఐ పాట లిరిక్స్‌ని తయారు చేసి స్క్రీన్‌పై చూపుతుంది. ఆ సాహిత్యం మీకు నచ్చితే నెక్ట్స్‌పై క్లిక్‌ చేయగానే పాట జనరేట్‌ అవుతుంది.
  •  ఇలా జనరేట్‌ అయిన పాటను విని మీకు నచ్చితే మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్‌ చేయొచ్చు. అలాగే డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
  •  ఒక వేళ పాట నచ్చకపోతే పదాలు మార్చి మరోసారి ప్రయత్నించొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని