OnePlus: వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 3 ధర తగ్గింపు.. ఇప్పుడెంతంటే?

OnePlus Nord CE 3 Price Cut: జులైలో విడుదలైన వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 3 స్మార్ట్‌ఫోన్‌ ధరను కంపెనీ రూ.2,000 వరకు తగ్గించింది.

Published : 29 Nov 2023 19:09 IST

OnePlus Nord CE 3 Price Cut | ఇంటర్నెట్‌ డెస్క్‌: వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 3 (OnePlus Nord CE 3) స్మార్ట్‌ఫోన్‌ ధరను కంపెనీ తగ్గించింది. ఈ సిరీస్‌ ఫోన్‌లపై రూ.2,000 వరకు కుదించింది. స్నాప్‌డ్రాగన్‌ 782జీ ప్రాసెసర్‌తో వచ్చిన ఫోన్‌ ఈ ఏడాది జూన్‌లో విడుదలైంది.

వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 3 (OnePlus Nord CE 3) ఫోన్‌ 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజ్‌ వేరియంట్‌ ప్రస్తుత ధర రూ.24,999కు తగ్గింది. ఈ ఫోన్‌ను కంపెనీ రూ.26,999 ప్రారంభ ధర వద్ద విడుదల చేసింది. ఈ ఫోన్‌లో టాప్‌ మోడల్‌ అయిన 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.28,999 నుంచి రూ.27,999కు తగ్గింది. ఆక్వా సర్జ్‌, గ్రే షిమ్మర్‌ షేడ్‌లలో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంది.

ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత ఆక్సిజన్‌ఓస్‌ 13.1తో వన్‌ప్లస్ నార్డ్‌ సీఈ 3 (OnePlus Nord CE 3) ఫోన్‌ పనిచేస్తుంది. 6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+, అమోలెడ్‌ తెరను పొందుపర్చారు. ఆక్టాకోర్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 782జీ ప్రాసెసర్‌తో వస్తోంది. 50 మెగాపిక్సెల్‌ ప్రధాన కెమెరా, 16 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరాను పొందుపర్చారు. మైక్రోఎస్‌డీ కార్డ్‌ ద్వారా స్టోరేజ్‌ను 1 టీబీ వరకు విస్తరించుకోవచ్చు.

5జీ, 4జీ ఎల్‌టీఈ, వైఫై, బ్లూటూత్‌ 5.2, ఎన్‌ఎఫ్‌సీ, జీపీఎస్‌, ఏ-జీపీఎస్‌, యూఎస్‌బీ టైప్‌-సీ పోర్ట్‌ వంటి కనెక్టివిటీ ఫీచర్లు వన్‌ప్లస్ నార్డ్‌ సీఈ 3 (OnePlus Nord CE 3)లో ఉన్నాయి. యాక్సెలరోమీటర్‌, యాంబియెంట్‌ లైట్‌ సెన్సర్‌, ఇ-కంపాస్‌, ఐఆర్‌ బ్లాస్టర్‌, గైరోస్కోప్‌, ప్రాక్జిమిటీ సెన్సర్‌, టెంపరేచ్ సెన్సర్లు ఉన్నాయి. బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌ కోసం స్కీన్‌పై ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌ కూడా ఉంది. 80వాట్‌ SuperVOOC సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని పొందుపర్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని