Airtel Prepaid Plans: ఈ ఐదు ఎయిర్‌టెల్‌ ప్లాన్లలోనే డిస్నీ+ హాట్‌స్టార్‌ లేదా అమెజాన్‌ ప్రైమ్‌!

Airtel Prepaid Plans: డిస్నీ+ హాట్‌స్టార్‌ లేదా అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌తో కూడిన ప్రీపెయిడ్ ప్లాన్లు ఎయిర్‌టెల్‌లో కొన్నే ఉన్నాయి. అవేంటి? వాటిలో ఉన్న ఇతర ప్రయోజనాలేంటో చూద్దాం..!

Published : 21 Apr 2023 20:27 IST

Airtel Prepaid Plans | ఇంటర్నెట్‌ డెస్క్‌: వివిధ ఓటీటీలను ఒకే వేదికపై అందించే ఎక్స్‌ట్రీమ్‌ యాప్‌ ప్రయోజనాలను పొందేందుకు ఎయిర్‌టెల్‌లో అనేక ప్లాన్లు ఉన్నాయి. కానీ, వీటిలో అత్యంత ప్రజాదరణ ఉన్న డిస్నీ+ హాట్‌స్టార్‌ (Disney+ Hotstar) లేదా అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ (Amazon Prime Membership)తో కూడిన ప్లాన్లు మాత్రం కొన్నే. ప్రస్తుతం ఐదు ప్లాన్లలో మాత్రమే పైన తెలిపిన ఓటీటీల్లో ఏదో ఒకటి అందుబాటులో ఉంది. డిస్నీ+హాట్‌స్టార్‌తో కూడిన అనేక ప్లాన్లు ఎయిర్‌టెల్‌లో కొన్ని నెలల క్రితం వరకు అందుబాటులో ఉండేవి. కానీ, వాటిలో చాలా వరకు ఎయిర్‌టెల్‌ ఇటీవల తొలగించింది.

డిస్నీ+ హాట్‌స్టార్‌ అందుబాటులో ఉన్న ప్లాన్లు..

మొత్తం మూడు ప్రీపెయిడ్‌ ప్లాన్లలో డిస్నీ+ హాట్‌స్టార్‌ (Disney+ Hotstar) ఓటీటీని భారతీ ఎయిర్‌టెల్‌ అందిస్తోంది. అవి రూ.499, రూ.839, రూ.3,359 ప్లాన్లు. వీటన్నింటిలో అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు ఉన్నాయి. రూ.3,359 ప్లాన్‌లో రోజుకి 2.5 జీబీ డేటా లభిస్తుంది. రూ.839 ప్లాన్‌లో రోజుకి 2జీబీ డేటా, రూ.499తో రోజుకి 3జీబీ డేటా లభిస్తుంది. రూ.3,359 ప్లాన్‌ కాలపరిమితి 365 రోజులు కాగా.. రూ.499 ప్లాన్‌ వ్యాలిడిటీ 28 రోజులు, రూ.839 ప్లాన్ గడువు 84 రోజులు.

రూ.3,359 ప్లాన్‌లో యూజర్లు డిస్నీ+హాట్‌స్టార్‌ (Disney+ Hotstar) మొబైల్‌ను ఏడాది వరకు వీక్షించే అవకాశం ఉంటుంది. అలాగే అపరిమిత 5జీ డేటా కూడా లభిస్తుంది. అపోలో 24/7 సర్కిల్‌, ఫాస్టాగ్‌పై రూ.100 క్యాష్‌బ్యాక్‌, హలోట్యూన్స్‌, వింక్‌ మ్యూజిక్‌ వంటి ప్రయోజనాలను కూడా ఉచితంగా పొందొచ్చు. రూ.839, రూ.499 ప్లాన్లలో డిస్నీ+ హాట్‌స్టార్‌ మొబైల్‌ను మూడు నెలల వరకు వీక్షించొచ్చు. ఈ రెండు ప్లాన్లలో అపరిమిత 5జీ డేటా, ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌ ప్రయోజనాలను కూడా పొందొచ్చు.

అమెజాన్‌ ప్రైమ్‌ అందుబాటులో ఉన్న ప్లాన్లు..

ఎయిర్‌టెల్‌ రెండు ప్రీపెయిడ్‌ ప్లాన్లతో అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ (Amazon Prime Membership)ను యూజర్లకు అందిస్తోంది. వాటిలో ఒకటి రూ.699 కాగా.. మరొకటి రూ.999 ప్లాన్‌. వీటి గడువు వరుసగా 56 రోజులు, 84 రోజులు. ఈ రెండింటిలో అపరిమిత వాయిస్ కాలింగ్‌, రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు అందుబాటులో ఉంటాయి. రూ.699 ప్లాన్‌లో రోజూ 3జీబీ డేటా లభిస్తుంది. అమెజాన్‌ ప్రైమ్‌ను 56 రోజుల పాటు వీక్షించొచ్చు. రూ.999తో రోజుకి 2.5జీబీ డేటాను, 84 రోజుల వరకు అమెజాన్‌ ప్రైమ్‌ సభ్యత్వాన్ని (Amazon Prime Membership) పొందొచ్చు. ఈ రెండు ప్లాన్లలో ఎక్స్‌ట్రీమ్‌ యాప్‌, అపరిమిత 5జీ డేటా వంటి అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని