Oppo F31 series: ఒప్పో ఎఫ్‌ 31 సిరీస్‌ విడుదల.. 3 ఫోన్ల ధరలు, విశేషాలు ఇవీ

Eenadu icon
By Business News Team Published : 15 Sep 2025 17:15 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

Oppo F31 series | ఇంటర్నెట్‌ డెస్క్‌: చైనాకు చెందిన మొబైల్‌ తయారీ సంస్థ ఒప్పో ఎఫ్‌31 సిరీస్‌లో మూడు ఫోన్లను దేశీయంగా లాంచ్‌ చేసింది. ఒప్పో ఎఫ్‌ 31 5జీ, ఎఫ్‌ 31 ప్రో 5జీ, ఎఫ్‌ 31 ప్రో+ 5జీ పేరిట మూడు మోడళ్లను లాంచ్‌ చేసింది. ఈ మూడు ఫోన్లూ 7,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 50 ఎంపీ కెమెరాతో వస్తున్నాయి. ఇంతకీ ఏయే ఫోన్లు ఎంత ధరలో వస్తున్నాయ్‌? వాటి స్పెసిఫికేషన్స్‌ ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఎఫ్‌ 31 5జీ సిరీస్‌ స్పెసిఫికేషన్లు

ఎఫ్‌31 స్మార్ట్‌ఫోన్‌ 6.5 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ అమోలెడ్‌ డిస్‌ప్లేతో వస్తోంది. ఇందులో డైమెన్‌సిటీ 6300 ప్రాసెసర్‌ అమర్చారు. ఎఫ్‌31 ప్రో 5జీలో మీడియాటెక్‌ డైమెన్‌సిటీ 7,300 ప్రాసెసర్‌ ఉంది. ఇది కూడా 6.57 అంగుళాల అమెలెడ్‌ డిస్‌ప్లేతో వస్తోంది. ప్రో ప్లస్‌ మోడల్‌లో స్నాప్‌డ్రాగన్‌ 7 జనరేషన్‌ 3 ప్రాసెసర్‌ను వినియోగించారు. ఇందులో 6.8 అంగుళాల ఫ్లా్‌ట్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే ఇచ్చారు.

ఈ మూడు ఫోన్లూ ఔటాఫ్‌ది బాక్స్‌ ఆండ్రాయిడ్‌ 15తో కూడిన కలర్‌ఓఎస్‌ 15తో పనిచేస్తాయి. ఈ మూడు మోడళ్లలోనూ 50 ఎంపీ సెన్సర్‌తో పాటు 2 ఎంపీ మోనోక్రోమ్‌ సెన్సర్‌ ఉంది. బేస్‌ మోడల్‌లో 16 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా ఇవ్వగా.. ప్రో మోడళ్లలో 32 ఎంపీఈ సెన్సర్‌ ఇచ్చారు. మూడు ఫోన్లలోనూ 7000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 80W సూపర్‌వూక్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. 

ధరలు ఇలా

  • ఎఫ్‌ 31 బేస్‌ మోడల్‌ రెండు వేరియంట్లలో లభిస్తోంది. 8జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.22,999 కాగా.. 256 జీబీ వేరియంట్‌ ధర రూ.24,999కు లభిస్తుంది. మిడ్‌నైట్‌ బ్లూ, క్లౌడ్‌ గ్రీన్‌, బ్లూమ్‌ రెడ్‌ రంగుల్లో లభిస్తుంది. 
  • ఎఫ్‌ 31 ప్రో 5జీ మూడు వేరియంట్లలో లభ్యమవుతుంది. 8జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.26,999కు లభిస్తుంది. 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.28,999గా నిర్ణయించగా.. 12జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.30,999గా కంపెనీ పేర్కొంది. డిసర్ట్‌ గోల్డ్‌, స్పేస్‌ గ్రే రంగుల్లో లభిస్తుంది.
  • ఒప్పో ఎఫ్‌ 31 ప్రో+ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ+ 256జీబీ వేరియంట్‌ ధర రూ.32,999గా కంపెనీ నిర్ణయించగా.. 12జీబీ+ 256జీబీ వేరియంట్‌ ధర రూ.34,999గా పేర్కొంది. జెమ్‌స్టోన్‌ బ్లూ, హిమాలయన్‌ వైట్‌, ఫెస్టివ్‌ పింక్‌ రంగుల్లో లభిస్తుంది.
  • ఎఫ్‌31 బేస్‌ మోడల్‌ సెప్టెంబర్‌ 27 నుంచి అందుబాటులోకి రానుంది. ప్రో మోడళ్లు మాత్రం సెప్టెంబర్‌ 19 నుంచే అందుబాటులోకి రానున్నాయి. ఈ మూడు ఫోన్లూ ఆఫ్‌లైన్‌ రిటైల్‌ స్టోర్లతో పాటు, ఒప్పో వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ ప్లాట్‌ఫామ్‌లలో లభిస్తాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు