ఆర్‌బీఐ ఆంక్షలు.. Paytm షేర్లలో కొనసాగుతున్న అమ్మకాలు

Paytm shares: పేటీఎం షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. మూడో రోజైన సోమవారం కంపెనీ షేరు లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది.

Updated : 05 Feb 2024 13:06 IST

Paytm shares fall | దిల్లీ: పేటీఎం (Paytm) మాతృ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌ (One97 Communications Ltd) షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. ఆర్‌బీఐ (RBI) ఆంక్షల నేపథ్యంలో సోమవారం కూడా కంపెనీ షేర్లు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్‌ఈలో కంపెనీ షేరు 10 శాతం నష్టంతో రూ.438.35 వద్ద ట్రేడవుతుండగా.. ఎన్‌ఎస్‌ఈలో 9.99 శాతం నష్టంతో రూ.438.50 వద్ద లోయర్‌ సర్య్యూట్‌ను తాకింది. ఆర్‌బీఐ నిర్ణయం కారణంగా వరుసగా మూడు రోజుల్లో కంపెనీ మార్కెట్‌ విలువ రూ.20471 కోట్ల మేర క్షీణించింది. 

పేటీఎంకు ఏమైంది?

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై ఆర్‌బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 29 తర్వాత నుంచి డిపాజిట్లను స్వీకరించకూదని స్పష్టంచేసింది. వినియోగదార్ల ఖాతాలు, ప్రీ పెయిడ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌లు, వాలెట్‌లు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, నేషనల్‌ కామన్‌ మొబిలిటీ (ఎన్‌సీఎంసీ) కార్డులు తదితరాల్లో క్రెడిట్‌ లావాదేవీలు లేదా టాప్‌అప్‌లు చేయకూడదని ఆర్‌బీఐ తెలిపింది. ఈ ఆంక్షల నేపథ్యంలో వాలెట్లు, ఫాస్టాగ్‌ సర్వీసులను అందించేందుకు ఓ వైపు ఇతర వెండర్లు సిద్ధమవుతుండగా.. తమ వ్యాపారాన్ని కొనసాగించేందుకు ఆర్‌బీఐతో సంప్రదింపులు జరుపుతున్నామని పేటీఎం యాజమాన్యం చెబుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని