90W ఫాస్ట్ ఛార్జింగ్‌, 1.5k స్క్రీన్‌తో పోకో కొత్త ఫోన్‌.. వివరాలు ఇవే..

Poco F6: పోకో కొత్త ఫోన్‌ లాంచ్‌ చేసింది. పోకో ఎఫ్‌6 పేరుతో తీసుకొచ్చింది. మే 29 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

Updated : 28 May 2024 17:22 IST

Poco F6 | ఇంటర్నెట్‌ డెస్క్‌: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ పోకో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. తన ఎఫ్ సిరీస్‌లో ఎఫ్‌6 5జీ (Poco F6) ఫోన్‌ను తీసుకొచ్చింది. గతంలో అంతర్జాతీయ మార్కెట్‌లో తీసుకొచ్చిన రెడ్‌మీ టర్బో 3కి ఇది రీ బ్రాండ్‌ వెర్షన్‌. స్నాప్‌డ్రాగన్‌ ప్రాసెసర్‌, 1.5కె అమోలెడ్‌ స్క్రీన్‌, 90W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయం వంటివి ఇందులోని ప్రత్యేకతలు.

పోకో ఎఫ్‌6 మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ+ 256జీబీ వేరియంట్ ధర రూ.29,999గా కంపెనీ నిర్ణయించింది. 12జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.31,999;  12జీబీ+512 జీబీ వేరియంట్‌ ధర రూ.33,999గా పేర్కొంది. బ్లాక్‌, టైటానియన్‌ రంగుల్లో ఈ ఫోన్లు లభిస్తాయి. ఫ్లిప్‌కార్ట్‌లో మే 29 నుంచి వీటి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. బ్యాంక్‌ ఆఫర్స్‌, ఎక్స్ఛేంజ్‌ ఆఫర్లతో బేస్‌ వేరియంట్‌ను రూ.25,999కే కొనుగోలు చేయొచ్చు.

ఇక ఫీచర్ల విషయానికొస్తే.. పోకో ఎఫ్‌6 5జీ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత హైపర్‌ ఓఎస్‌పై పని చేస్తుంది. మూడు మేజర్‌ ఆండ్రాయిడ్‌ అప్‌డేట్స్‌, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ఇస్తామని కంపెనీ చెబుతోంది. 6.67 అంగుళాల 1.5 రిజల్యూషన్‌తో అమోలెడ్‌ డిస్‌ప్లేతో ఈ ఫోన్‌ వస్తోంది. 120Hz రిఫ్రెష్‌ రేటుతో వస్తోంది. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ ప్రొటెక్షన్‌తో వస్తోంది. స్నాప్‌డ్రాగన్‌ 8ఎస్‌ జనరేషన్‌ 3 ప్రాసెసర్‌ అమర్చారు. వెనక వైపు 50 ఎంపీ ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌తో కూడిన కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 20 ఎంపీ కెమెరా ఇచ్చారు. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 90W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో వస్తోంది. బాక్స్‌లో 120W ఫాస్ట్‌ ఛార్జర్‌ను అందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు