Raghuram Rajan: ఆర్‌బీఐ గవర్నర్‌గా అప్పట్లో ఏడాదికి రూ.4 లక్షల జీతం.. రఘురామ్‌ రాజన్‌

Raghuram Rajan: ఆర్‌బీఐ గవర్నర్‌గా ఏడాదికి రూ.4లక్షల జీతం తీసుకున్నానని రఘురామ్‌ రాజన్‌ ఓ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించారు.

Updated : 26 Dec 2023 17:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ (Raghuram Rajan) ఇటీవల తన వృత్తి జీవితానికి సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆర్‌బీఐ గవర్నర్‌ (RBI Governor)గా తాను అందుకున్న జీతభత్యాలను పంచుకున్నారు. యూట్యూబర్‌ రాజ్‌ షమానీ నిర్వహించిన ఓ పాడ్‌కాస్ట్‌లో రాజన్‌ ఈ వివరాలను బయటపెట్టారు.

‘ఆర్‌బీఐ గవర్నర్లకు ఇచ్చే వేతనాలు ఎలా ఉంటాయి?’ అని యూట్యూబర్‌ అడిగిన ప్రశ్నకు రాజన్‌ బదులిస్తూ.. ‘‘ఇప్పుడు ఆర్‌బీఐ గవర్నర్ల వేతనాలు (Salary) ఎలా ఉన్నాయో నాకు తెలియదు. కానీ నేను మాత్రం ఏడాదికి రూ.4లక్షల జీతం తీసుకున్నా. ఇక కేంద్ర బ్యాంక్‌ గవర్నర్‌గా నాకు అందిన సదుపాయాల్లో పెద్ద ఇంటిని కేటాయించారు. అది కూడా ముంబయిలోని మలబార్‌ హిల్స్‌లో అంబానీ ఇంటికి కొంచెం దూరంలోనే’’ అని వెల్లడించారు.

చలిలో విద్యుత్‌ వాహనాల వాడకం.. ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

కేబినెట్‌ సెక్రటరీతో సమాన హోదాలో ఆర్‌బీఐ గవర్నర్‌కు వేతనాలు, ఇతర సదుపాయాలు కల్పిస్తారని రాజన్‌ తెలిపారు. ‘‘ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఆర్‌బీఐ మాజీ గవర్నర్లకు సదుపాయాలు ఉండవు. అయితే వైద్య సదుపాయాలు కల్పిస్తారు’’ అని తెలిపారు. ఆర్‌బీఐ గవర్నర్‌ పదవి నుంచి దిగిపోయిన తర్వాత తనకు ఫుల్‌టైమ్‌ ఉద్యోగం లభించిందని తెలిపారు.

రఘురామ్‌ రాజన్‌ 2013 నుంచి 2016 వరకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌కు గవర్నర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత షికాగో యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా చేరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు