RBI: ఐసీఐసీఐ, కోటక్‌ బ్యాంకులకు ఆర్‌బీఐ భారీ జరిమానా

RBI penalty on ICICI, Kotak Mahindra Bank: ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంకుకు ఆర్‌బీఐ జరిమానా విధించింది. రెగ్యులేటరీ నిబంధనలు పాటించనందుకు ఈ జరిమానా విధిస్తున్నట్లు పేర్కొంది.

Updated : 17 Oct 2023 18:09 IST

ముంబయి: ప్రముఖ ప్రైవేటురంగ బ్యాంకులైన ఐసీఐసీఐ బ్యాంక్‌ (ICICI bank), కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ (Kotak Mahindra Bank)పై రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (RBI) కొరడా ఝుళిపించింది. రెగ్యులేటరీ నిబంధనలు పాటించనందుకు గానూ మంగళవారం భారీ జరిమనా విధించింది. ఐసీఐసీఐ బ్యాంక్‌కు రూ.12.19 కోట్లు, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌కు రూ.3.95 కోట్లు చొప్పున పెనాల్టీ వేసింది.

రుణాలు అడ్వాన్సులు-చట్టబద్ధమైన, ఇతర నిబంధనలు; మోసాల వర్గీకరణ, కమర్షియల్‌ బ్యాంకుల రిపోర్టింగ్‌కు సంబంధించి ఆర్‌బీఐ జారీ చేసిన నిబంధనలు పాటించనందుకు ఐసీఐసీఐ బ్యాంక్‌కు ఈ జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ పేర్కొంది. ఆర్థిక సేవల అవుట్‌ సోర్సింగ్‌లో రిస్క్‌లు, ప్రవర్తన నియమావళి ఉల్లంఘన; రికవరీ ఏజెంట్లు; కస్టమర్‌ సర్వీసుకు సంబంధించిన ఆర్‌బీఐ నిర్దేశించిన నిబంధనలు పాటించడంలో విఫలమైనందుకు కోటక్‌ బ్యాంకుకు జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ తెలిపింది.

ఓలా ఫెస్టివ్‌ ఆఫర్‌.. స్కూటర్లపై తక్కువ వడ్డీకే రుణాలు, ఎక్స్ఛేంజీపై బోనస్‌

రెగ్యులేటరీ నిబంధనలు పాటించనందుకు మాత్రమే రెండు బ్యాంకులకు జరిమానా విధించామని, ఖాతాదారుల లావాదేవీలకు ఈ జరిమానాలతో సంబంధం లేదని ఆర్‌బీఐ స్పష్టంచేసింది. ఇటీవల పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌కు (Paytm Payments Bank)కు సైతం ఆర్‌బీఐ జరిమానా విధించింది. కేవైసీ సహా కొన్ని నిబంధనలు పాటించడంలో విఫలమైనందుకు రూ.5.39 కోట్లు జరిమానా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని