Ola electric: ఓలా ఫెస్టివ్‌ ఆఫర్‌.. స్కూటర్లపై తక్కువ వడ్డీకే రుణాలు, ఎక్స్ఛేంజీపై బోనస్‌

Ola Electric Announces Festive Offers: వరుస పండగలను పురస్కరించుకుని భారత్ ఈవీ ఫెస్ట్‌ను ఓలా ప్రకటించింది. ఈ ఫెస్ట్‌లో భాగంగా స్పెషల్‌ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్, ప్రత్యేక డిస్కౌంట్‌లు, బ్యాటరీపై వారెంటీ పొడిగింపు వంటివి అందిస్తోంది.

Published : 17 Oct 2023 16:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola electric) పండగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను తీసుకొచ్చింది. వరుస పండగలను పురస్కరించుకుని భారత్ ఈవీ (Bharat EV Fest) ఫెస్ట్‌ను ప్రకటించింది. అక్టోబర్‌ 16 నుంచి దీన్ని ప్రారంభించింది. ఈ ఫెస్ట్‌లో భాగంగా స్పెషల్‌ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్, ప్రత్యేక డిస్కౌంట్‌లు, బ్యాటరీపై వారెంటీ పొడిగింపు వంటివి అందిస్తోంది. ఫెస్ట్‌ సమయంలో ఓలా స్కూటర్‌ని టెస్ట్-రైడింగ్ చేసే కస్టమర్లకు కొన్ని బహుమతులు ఇవ్వడంతో పాటు ప్రతిరోజూ ఒక S1X+ స్కూటర్‌ను గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.

పండగ సీజన్‌కు సిద్ధమవుతున్న వేళ ఈ ఫెస్ట్‌ను తీసుకొస్తున్నందుకు ఆనందంగా ఉందని ఓలా ఎలక్ట్రిక్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్షుల్ ఖండేల్వాల్ అన్నారు. టూవీలర్‌ సెగ్మెంట్‌లో #EndICEAgeకు కట్టుబడి ఉన్నామని, అందులో భాగంగానే ఈ ఫెస్ట్‌ను ప్రకటించినట్లు తెలిపారు. దీపావళి పండగ సందర్భంగా ఈవీకి మారడానికి ఇదే సరైన తరుణమని, తమ ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రాలను సందర్శించి ఓలా స్కూటర్లను టెస్ట్ రైడ్ చేయొచ్చని కొనుగోలుదారులకు సూచించారు.

స్మార్ట్‌కనెక్ట్‌ టెక్నాలజీతో టీవీఎస్‌ జుపిటర్‌ 125

భారత్‌ ఫెస్ట్‌లో భాగంగా.. ఓలా ‘5 ఇయర్స్‌ బ్యాటరీ ప్రామిస్‌’ ప్రోగ్రామ్‌ను తీసుకొస్తున్నట్లు ఓలా ప్రకటించింది. S1 ప్రో 2వ జనరేషన్‌పై 5 సంవత్సరాల ఎక్స్టెండెడ్ బ్యాటరీ వారంటీని అందిస్తున్నామని, S1 ఎయిర్‌ కొన్నవారికి ఎక్స్టెండెడ్ బ్యాటరీ వారంటీపై 50 శాతం తగ్గింపును అందిస్తున్నట్లు తెలిపింది. వెయ్యికి పైగా ఉన్న తమ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లలో ICE-to-EV ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్నామని, పాత పెట్రోల్‌తో నడిచే టూవీలర్‌ను తీసుకొచ్చి కొత్త ఓలా స్కూటర్ కొనుగోలు చేయొచ్చని ఓలా తెలిపింది. ఎక్స్ఛేంజీ కింద రూ.10వేలు అదనపు బోనస్‌ సదుపాయం కల్పిస్తున్నామని ఓలా పేర్కొంది.

ఏదైనా ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో ఓలా స్కూటర్‌ని టెస్ట్-రైడ్ చేయొచ్చని, ప్రతిరోజూ S1X+ స్కూటర్‌ను గెలుచుకునే అవకాశం పొందొచ్చని ఓలా తెలిపింది. ఉచిత మర్చండైస్, బహుమతులు, ఓలా కేర్‌+ డిస్కౌంట్ కూపన్లు, అన్ని కొత్త S1 ప్రో రెండో జనరేషన్‌పై ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ కూడా పొందొచ్చని ఓలా పేర్కొంది. అలాగే, ఎంపిక చేసిన క్రెడిట్ కార్డు EMIలపై కొనుగోలుదారులకు రూ.7,500 వరకు డిస్కౌంట్‌ ఇస్తున్నామని, 5.99 శాతం వడ్డీకే జీరో డౌన్ పేమెంట్, జీరో-ప్రాసెసింగ్ ఫీజుతో ఓలా స్కూటర్‌ను సొంతం చేసుకోవచ్చని ఓలా తెలిపింది. 

రిటైర్‌మెంట్‌ ప్లాన్‌.. ఏ వయసులో ఎలా?

ఫెస్టివ్‌ సీజన్‌లో భాగంగా అక్టోబర్ 24 వరకు ఓలా తన కమ్యూనిటీ సభ్యులకు వారి స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఓలా స్కూటర్‌ను రెఫర్ చేస్తే రివార్డ్ అందజేస్తుంది. రిఫరర్‌కి ఉచిత ఓలా కేర్+, ప్రతి రెఫరల్‌కు రూ.2000 వరకు క్యాష్‌బ్యాక్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. విజయవంతంగా కొనుగోలు చేసిన తర్వాత రిఫరీలు రూ.1,000 క్యాష్‌బ్యాక్‌ను కూడా అందుకుంటారు. ప్రస్తుతం ఓలా విక్రయిస్తున్న వాటిలో ఎస్‌1 ప్రో సెకండ్‌ జనరేషన్‌ ధర రూ. 1,47,499; S1 ఎయిర్ ధర రూ.1,19,999గా ఉంది. ఓలా ఎస్‌ S1Xని మూడు వేరియంట్లలో ఇస్తున్నారు. S1 X+ రూ.1,09,999; S1 X (3kWh) రూ.99,999; S1 X (2kWh) రూ.89,999 ధరలో అందుబాటులో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని