Bank of Baroda: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు ఊరట.. యాప్‌పై ఆంక్షలు ఎత్తివేసిన ఆర్‌బీఐ

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాపై గతంలో విధించిన ఆంక్షలను ఆర్‌బీఐ ఎత్తివేసింది. బ్యాంక్‌ ఈవిషయాన్ని వెల్లడించింది.

Published : 08 May 2024 20:04 IST

Bank of Baroda | ముంబయి: ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు (Bank of Baroda) ఊరట లభించింది. బ్యాంక్‌కు చెందిన మొబైల్‌ అప్లికేషన్‌ బీఓబీ వరల్డ్‌పై విధించిన ఆంక్షలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ఎత్తివేసింది. కొత్త కస్టమర్లను చేర్చుకోవడానికి అనుమతించిందని ఆ బ్యాంక్‌ బుధవారం పేర్కొంది. మొబైల్‌ అప్లికేషన్‌లో కొన్ని లోపాలు బయటపడడంతో కొత్త కస్టమర్లను చేర్చుకోవడంపై ఆర్‌బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.

దాదాపు 7 నెలలుగా తమ మొబైల్‌ అప్లికేషన్‌పై అమల్లో ఉన్న ఆంక్షలను ఆర్‌బీఐ ఎత్తివేసిందని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తాజాగా తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిందని పేర్కొంది. దీంతో కొత్త కస్టమర్లను చేర్చుకోవడానికి ఉన్న ఇబ్బందులు తొలగిపోయాయని తెలిపింది. ఇకపై ఆర్‌బీఐ నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకుంటామని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు