6 నెలలు దాటినా రూ.9700 కోట్లు విలువైన ₹2 వేల నోట్లు ప్రజల వద్దే

RBI on 2000 notes: రూ.2వేల నోట్లను ఉపసంహరించుకుని ఆరు నెలలు గడిచినా ఇప్పటికీ రూ.9700 కోట్ల విలువైన నోట్లు మాత్రం వెనక్కి రాలేదు.

Updated : 01 Dec 2023 16:21 IST

Rs 2,000 notes | ముంబయి: చలామణీలో ఉన్న 97.26 శాతం రూ.2 వేల నోట్లు తిరిగి బ్యాంకుల వద్దకు వచ్చేశాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) వెల్లడించింది. రూ.2 వేల నోటును ఉపసంహరించుకుని ఆరు నెలలు దాటినప్పటికీ.. రూ.9,760 కోట్లు విలువైన నోట్లు ఇంకా ప్రజల వద్దే ఉన్నాయని తెలిపింది. రూ.2 వేల నోటు ఇప్పటికీ లీగల్‌ టెండర్‌గా కొనసాగుతుందని ఆర్‌బీఐ మరోసారి స్పష్టంచేసింది.

రూ.2వేల విలువైన నోటును ఆర్‌బీఐ ఈ ఏడాది మే 19న ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ఆర్‌బీఐ నిర్ణయం వెలువడే నాటికి రూ.3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణీలో ఉన్నాయి. బ్యాంకుల్లో నోట్ల మార్పిడికి/ డిపాజిట్‌కు ప్రజలకు తొలుత సెప్టెంబర్‌ 30 వరకు అవకాశం ఇచ్చారు. తర్వాత అక్టోబర్‌ 7 వరకు ఆ గడువును పొడిగించారు. ప్రస్తుతం ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మాత్రమే నోట్లను స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలో నవంబర్‌ 30 నాటికి 97.26 శాతం నోట్లు వెనక్కి వచ్చాయని ఆర్‌బీఐ తెలిపింది.

ఫ్లెయిర్‌ రైటింగ్‌ లిస్టింగ్‌ అదుర్స్‌.. ఒక్కో లాట్‌పై రూ.12,800 లాభం

ఇప్పటికీ రూ.2వేల నోటు చెల్లుబాటు అవుతుందని, ఆర్‌ఐబీ ప్రాంతీయ కార్యాలయాల వద్ద నోట్లను ఎక్స్ఛేంజీ/ డిపాజిట్‌ చేసుకోవచ్చని ఆర్‌బీఐ తెలిపింది. ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు చేరుకోలేనివారు రూ.2 వేలు నోట్లను పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ ద్వారా ఆయా కార్యాలయాలకు పంపించొచ్చని పేర్కొంది. హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, బెంగళూరు, బేల్‌పుర్‌, భోపాల్‌, భువనేశ్వర్‌, ఛండీగడ్‌, చెన్నై, గువాహటి, జైపూర్‌, జమ్ము, కాన్పూర్‌, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబయి, నాగ్‌పూర్‌, దిల్లీ, పట్నా, తిరువనంతపురంలో ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు