RBI: మూడు బ్యాంకులకు ఆర్‌బీఐ రూ. 10 కోట్ల జరిమానా

పెద్ద మొత్తంలో రుణాల జారీకి సంబంధించి నిబంధనలు పాటించనందుకు మూడు బ్యాంకులకు ఆర్‌బీఐ జరిమానా విధించింది. 

Published : 24 Nov 2023 20:08 IST

ముంబయి: రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా (RBI) మూడు బ్యాంకులకు రూ.10.34 కోట్ల జరిమానా విధించింది. ఈ మేరకు శుక్రవారం వేర్వేరు ప్రకటనలు విడుదల చేసింది. ఆర్‌బీఐ జరిమానా విధించిన వాటిలో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు కాగా, ఒకటి ప్రైవేటు రంగ బ్యాంకు. ఆర్‌బీఐ మార్గదర్శకాలను పాటించని కారణంగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (Bank of Barodda), ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌ (Indian Overseas Bank), సిటీ బ్యాంక్‌ (Citibank)లకు జరిమానా విధించినట్లు తెలిపింది. 

వ్యక్తిగత రుణాలు ప్రియం కానున్నాయా? కారణం ఇదే!

పెద్ద మొత్తంలో రుణాలు జారీకి సంబంధించి ఆర్‌బీఐ నిబంధనలు పాటించనందుకు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు రూ.4.34 కోట్లు జరిమానా విధించింది. ఆర్థికపరమైన అవుట్‌సోర్సింగ్ సేవలకు సంబంధించి ఆర్‌బీఐ రూపొందించిన నిబంధనలను అతిక్రమించినందుకు సిటీ బ్యాంక్‌కు రూ.ఐదు కోట్లు... రుణాల జారీ విషయంలో నిబంధనలు పాటించడంలో విఫలమైనందుకు ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌కు రూ.కోటి జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ తెలిపింది. మార్చి 31, 2021లో ఆర్‌బీఐ తనిఖీల్లో ఈ విషయం బయటపడినట్లు వెల్లడించింది. రెగ్యులేటరీ నిబంధనలు పాటించనందుకు మాత్రమే మూడు బ్యాంకులకు జరిమానా విధించామని, ఖాతాదారుల లావాదేవీలకు ఈ జరిమానాలతో సంబంధం లేదని ఆర్‌బీఐ స్పష్టంచేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని