Paytm: పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌కు ఆర్‌బీఐ షాక్‌

Paytm Payments Bank: పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌కు ఆర్‌బీఐ షాకిచ్చింది. డిపాజిట్లు, టాప్‌-అప్‌లపై ఆంక్షలు విధించింది.

Updated : 31 Jan 2024 18:59 IST

Paytm Payments Bank | ముంబయి: పేటీఎంకు చెందిన పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌కు (Paytm Payments Bank) రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) షాకిచ్చింది. ఫిబ్రవరి 29 తర్వాత ఏ కస్టమర్‌, ప్రీపెయిడ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌, వ్యాలెట్‌, ఫాస్టాగ్‌లలో డిపాజిట్లు, టాప్‌-అప్‌లు చేపట్టకూడదని ఆదేశించింది. సమగ్ర సిస్టమ్‌ ఆడిట్‌, బయటి ఆడిటర్ల నివేదికలను అనుసరించి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL)పై ఆర్‌బీఐ చర్యలు తీసుకుంది. బ్యాంక్‌లో నిబంధనల ఉల్లంఘనను గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ తన ప్రకటనలో తెలిపింది.

రిలయన్స్‌ మళ్లీ నం.1.. ఈ జాబితాలో 3 అదానీ కంపెనీలు ఔట్‌!

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకులోని సేవింగ్స్‌ అకౌంట్‌, కరెంట్‌ అకౌంట్‌, ప్రీపెయిడ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌, ఫాస్టాగ్స్, నేషనల్‌ కామన్‌ మొబిలిటీ కార్డ్స్‌లో నిల్వ ఉన్న మొత్తాల విత్‌డ్రా, వినియోగం విషయంలో కస్టమర్లపై ఎలాంటి ఆంక్షలూ ఉండవని ఆర్‌బీఐ స్పష్టంచేసింది. వడ్డీ, క్యాష్‌బ్యాక్‌, రిఫండ్లకు ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చింది. 2022 మార్చిలో సైతం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్‌బీఐ కఠిన చర్యలు తీసుకుంది. కొత్త కస్టమర్లను చేర్చుకోవడాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు