Realme 11 Pro: 200MP కెమెరా..5000mAh బ్యాటరీతో రియల్‌మీ 11ప్రో ఫోన్లు
Realme 11 Pro: రియల్‌మీ 11 ప్రో సిరీస్‌లో రెండు ఫోన్లు గురువారం భారత మార్కెట్‌లోకి వచ్చాయి. ఇవి త్వరలో అమెజాన్, రియల్‌మీ వెబ్‌సైట్‌లో విక్రయానికి అందుబాటులో ఉండనున్నాయి.
Realme 11 Pro | ఇంటర్నెట్ డెస్క్: రియల్‌మీ 11 ప్రో సిరీస్ (Realme 11 Pro Series) స్మార్ట్‌ఫోన్‌లు భారత్‌లో విడుదలయ్యాయి. రియల్‌మీ 11 ప్రో 5G, 11 ప్రో+ 5G (Realme 11 Pro+) పేరిట వస్తున్న ఈ ఫోన్లు మే 10నే చైనా మార్కెట్‌లోకి వచ్చేశాయి. వీటిలో 6.7 ఫుల్ హెచ్‌డీ+ తెర, ఆక్టాకోర్ 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌ను ఇస్తున్నారు. ఇవి మూడు రంగుల్లో అందుబాటులో ఉన్నాయి.
రియల్‌మీ 11 ప్రో సిరీస్ ధర..
రియల్‌మీ 11 ప్రో 5జీ 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999. దీంట్లోనే 8GB + 256GB వేరియంట్ ధర రూ.24,999. 12GB + 256GB వేరియంట్ ధర రూ.27,999. జూన్ 16 మధ్యాహ్నం నుంచి ఇది అమెజాన్, రియల్‌మీ వెబ్‌సైట్, కొన్ని ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో విక్రయానికి అందుబాటులోకి రానుంది.
మరోవైపు రియల్‌మీ 11 ప్రో+ 5Gలో 8GB + 256GB ధర రూ.27,999. 12GB + 256GB ధర రూ.29,999. ఈ ఫోన్ జూన్ 15 మధ్యాహ్నం నుంచి అమెజాన్, రియల్‌మీ వెబ్‌సైట్ సహా ఎంపిక చేసిన స్టోర్లలో అందుబాటులోకి వస్తాయి. ఎర్లీ యాక్సెస్ సేల్ కింద వీటిని జూన్ 8న సాయంత్రం 6-8 గంటల మధ్య విక్రయానికి ఉంచుతున్నారు. ఈ సమయంలో ఫోన్ కొన్నవారికి రూ.2,000 రాయితీ లభించనుంది. మరోవైపు వివిధ బ్యాంకు కార్డులపై రియల్‌మీ ప్రో+ 5జీ కొనుగోలు చేసేవారికి రూ.2,000, రియల్‌మీ ప్రో+పై రూ.1,500 వరకు రాయితీ ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
రియల్‌మీ 11 ప్రో సిరీస్ ఫీచర్లు..
రియల్‌మీ 11 ప్రో (Realme 11 Pro), రియల్‌మీ 11 ప్రో+ (Realme 11 Pro+) ఫోన్లు ఆండ్రాయిడ్ 13 ఆధారిత రియల్‌మీ యూఐ4.0 ఓఎస్‌తో వస్తున్నాయి. రెండింటిలోనూ 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ (1,080x2,412 pixels) కర్వ్‌డ్ తెరను ఇస్తున్నారు. 6ఎన్‌ఎం ఆక్టాకోర్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ ఉంది. 11 ప్రో ఫోన్‌లో 100 మెగాపిక్సెల్ కెమెరాను ఇస్తున్నారు. 11 ప్రో+లో 200 మెగాపిక్సెల్ కెమెరాను పొందుపర్చారు. వీటిలో వరుసగా 16 మెగాపిక్సెల్, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. ఈ రెండింటిలోనూ 5,000mAh బ్యాటరీని ఇస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Paritala Sunitha: మాజీ మంత్రి పరిటాల సునీత దీక్ష భగ్నం
-
Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Tirumala Brahmothsavalu: శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. వైభవంగా చక్రస్నానం
-
AP Assembly: ఎసైన్డ్ భూములను 20 ఏళ్ల తర్వాత బదలాయించుకోవచ్చు
-
పుంగనూరు కేసులో కుమారుడికి బెయిల్ రాలేదని.. తల్లి ఆత్మహత్యాయత్నం