Realme: 200MP కెమెరాతో రియల్‌మీ 11ప్రో సిరీస్‌ ఫోన్లు..విడుదల ఎప్పుడంటే?

Realme 11 Pro: రియల్‌మీ 11 ప్రో సిరీస్‌ ఫోన్లు చైనాలో ఇప్పటికే విడుదలయ్యాయి. భారత్‌లోకి తీసుకురాబోయే తేదీలను కంపెనీ ప్రకటించింది. వీటిలో 200MP సామర్థ్యంతో కూడిన కెమెరా ఉండడం విశేషం.

Published : 31 May 2023 15:05 IST

Realme 11 Pro | ఇంటర్నెట్‌ డెస్క్‌: రియల్‌మీ 11 ప్రో సిరీస్‌ (Realme 11 Pro Series) స్మార్ట్‌ఫోన్‌లు భారత్‌లో విడుదల కాబోతున్నాయి. జూన్‌ 8న ఇవి మార్కెట్‌లోకి రానున్నట్లు కంపెనీ బుధవారం ట్వీట్‌ చేసింది. రియల్‌మీ 11 ప్రో, 11 ప్రో+ (Realme 11 Pro+) ఫోన్లు చైనాలో మే 10న విడుదలయ్యాయి. వచ్చే నెల 8న భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నాయి.

రియల్‌మీ 11 ప్రో (Realme 11 Pro), రియల్‌మీ 11 ప్రో+ (Realme 11 Pro+) ఫోన్లు ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత రియల్‌మీ యూఐ4.0 ఓఎస్‌తో వస్తున్నాయి. రెండింటిలోనూ 6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ (1,080x2,412 pixels) కర్వ్‌డ్‌ తెరను ఇస్తున్నారు. 6ఎన్‌ఎం ఆక్టాకోర్‌ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌ ఉంది. 11 ప్రో ఫోన్‌లో 100 మెగాపిక్సెల్‌ కెమెరాను ఇస్తున్నారు. 11 ప్రో+లో 200 మెగాపిక్సెల్‌ కెమెరాను పొందుపర్చారు. వీటిలో వరుసగా 16 మెగాపిక్సెల్‌, 32 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి.

ఈ రెండింటిలో గరిష్ఠంగా ర్యామ్‌ 12GB, స్టోరేజ్‌ 1TB వరకు ఉంది. 67వాట్, 100వాట్‌ చార్జింగ్‌ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని ఇస్తున్నారు. చైనాలో విడుదలైన ఫోన్లలో పైన తెలిపిన ఫీచర్లు ఉన్నాయి. మరి భారత్‌లో ఏమైనా మార్పులుంటాయేమో చూడాల్సి ఉంది. కంపెనీ మాత్రం ఇప్పటి వరకు మార్పులున్నట్లు ఎలాంటి ప్రకటన చేయలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని