Realme 12 Series: రియల్‌మీ 12 సిరీస్‌లో 2 ఫోన్లు.. ధర, ఫీచర్లివే..!

Realme 12 Series: రియల్‌మీ 12, రియల్‌మీ 12 ప్లస్‌ ఫోన్లు బుధవారం భారత్‌లో విడుదలయ్యాయి. వీటి ధర, ఫీచర్ల వివరాలు చూద్దాం..!

Updated : 06 Mar 2024 16:35 IST

Realme 12 Series: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ 12 సిరీస్‌ ఫోన్లను భారత్‌లో బుధవారం విడుదల చేసింది. రియల్‌మీ 12 5జీ, రియల్‌మీ 12+ 5జీ పేరిట వస్తున్న వీటిని మిడ్‌రేంజ్ కస్టమర్లను దృష్టిలోఉంచుకొని తీసుకొచ్చింది. ఈ రెండూ కంపెనీ తాజా యూఐ ఆధారిత ఆండ్రాయిడ్‌ 14 ఓఎస్‌తో వచ్చాయి. రెండేళ్ల పాటు ఓఎస్‌, మూడేళ్లు సెక్యూరిటీ అప్‌డేట్లను అందిస్తామని తెలిపింది. 

రియల్‌మీ 12 5జీ ఫీచర్లు, ధర..

ఈ ఫోన్‌లో (Realme 12 5G) మీడియాటెక్‌ డైమెన్సిటీ 6100+ ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌ను ఇచ్చారు. 120Hz రీఫ్రెష్‌ రేటు, 650 నిట్స్‌ బ్రైట్‌నెస్‌తో కూడిన 6.72 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ+ తెరను పొందుపర్చారు. 45W SuperVOOC ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని అమర్చారు. వెనకభాగంలో 108ఎంపీ ప్రధాన కెమెరాను, సెల్ఫీల కోసం ముందువైపు 8ఎంపీ ఏఐ కెమెరాను ఇచ్చారు. బ్లూటూత్‌ 5.2, వైఫై 5, టైప్‌-సి పోర్టు, జీపీఎస్‌, క్యూజెడ్‌ఎస్‌ఎస్‌, గెలీలియో, Glonass వంటి ఫీచర్లూ ఉన్నాయి. ట్విలైట్ పర్పుల్, వుడ్‌ల్యాండ్‌ గ్రీన్‌ రెండు రంగుల్లో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంది. 6జీబీ + 128జీబీ వేరియంట్‌ ధర (Realme 12 5G Price) రూ.16,999. దీనిపై ప్రారంభ ఆఫర్‌ కింద కంపెనీ రూ.2,000 డిస్కౌంట్‌ కూపన్ అందిస్తోంది. 8జీ + 128జీబీ వేరియంట్‌ ధర రూ.17,999. బ్యాంక్‌ ఆఫర్‌ కింద రూ.1,000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ కింద మరో రూ.1,000 వరకు తగ్గుతుంది.

రియల్‌మీ 12+ 5జీ ఫీచర్లు, ధర..

రియల్‌మీ 12+ 5జీ (Realme 12+ 5G) ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌తో వస్తోంది. రియల్‌మీ యూఐ 5.0 ఆధారిత ఆండ్రాయిడ్‌ 14 ఓఎస్‌ను ఇచ్చారు. 67W SuperVOOC ఛార్జర్‌ సపోర్ట్‌తో 5,000ఎంఏహెచ్‌ బ్యాటరీని పొందుపర్చారు. 120Hz రీఫ్రెష్‌ రేటు, గరిష్ఠంగా 2000 నిట్స్‌ బ్రైట్‌నెస్‌తో కూడిన 6.67 అంగుళాల అల్ట్రా స్మూత్‌ ఓఎల్‌ఈడీ తెరను అమర్చారు. 50 ఎంపీ ప్రధాన, 16 ఎంపీ ఏఐ సెల్ఫీ కెమెరాను ఇచ్చారు. వైఫై 6, బ్లూటూత్‌ 5.2, టైప్‌-సి పోర్టు, జీపీఎస్‌, క్యూజెడ్‌ఎస్‌ఎస్‌, గెలీలియో, Glonass వంటి ఫీచర్లూ ఉన్నాయి. పయోనీర్‌ గ్రీన్‌, నావిగేటర్‌ బీజ్‌ రెండు రంగుల్లో అందుబాటులో ఉంది. 8జీబీ + 128జీబీ వేరియంట్‌ ధర రూ.20,999. ప్రారంభ ఆఫర్‌ కింద రూ.1,000 తగ్గింపు లభిస్తోంది. 8జీబీ + 256జీబీ వేరియంట్‌ ధర (Realme 12+ 5G Price) రూ.21,999. రెండు వేరియంట్లపై బ్యాంక్‌ ఆఫర్‌ కింద రూ.1,000 తక్షణ తగ్గింపు అదనం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని