Realme 12 pro: రియల్‌మీ 12 ప్రో+, 12 ప్రో విడుదల.. 120X జూమ్‌తో!

Realme 12 pro, 12 pro+ launched: రియల్‌మీ 12 ప్రో, 12 ప్రో+ మొబైల్స్‌ భారత్‌లో లాంచ్‌ అయ్యాయి. వీటి ధరలు రూ.25,999 నుంచి ప్రారంభం అవుతాయి.

Updated : 29 Jan 2024 17:29 IST

Realme 12 pro | ఇంటర్నెట్‌ డెస్క్‌: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ రియల్‌మీ (Realme) రెండు 5జీ స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. రియల్‌మీ 12 ప్రో (Realme 12 Pro), రియల్‌మీ 12ప్రో+ (Realme 12 Pro+5G) పేరిట వీటిని లాంచ్‌ చేసింది. 67W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌, 50 ఎంపీ కెమెరా వంటి ఫీచర్లతో పాటు 120X జూమ్‌ సపోర్ట్‌తో 12ప్రో+ వస్తోంది. ఈ ఫోన్ల ధర, విక్రయాలు, ఇతర వివరాలు ఇప్పుడు చూద్దాం..

రియల్‌మీ 12 ప్రో+ 5జీ మూడు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.29,999గా కంపెనీ నిర్ణయించింది. 8జీబీ+256జీబీ వేరియంట్‌ రూ.31,999గా పేర్కొంది. టాప్‌ ఎండ్‌ వేరియంట్‌ 12జీబీ+256 జీబీతో వస్తోంది. దీని ధరను రూ.33,999గా తెలిపింది. రియల్‌మీ 12 ప్రో 8జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.25,999గా నిర్ణయించగా.. 8జీబీ+256 జీబీ వేరియంట్‌ ధర రూ.26,999గా పేర్కొంది. ఫ్లిప్‌కార్ట్‌, రియల్‌మీ వెబ్‌సైట్లలో ఫిబ్రవరి 6 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఐసీఐసీఐ కార్డుదారులకు రూ.2వేల వరకు డిస్కౌంట్‌ అందిస్తున్నారు.

స్పెసిఫికేషన్స్‌

రియల్‌మీ 12ప్రో+ 5జీ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత రియల్‌మీ యూఐ 5.0తో పనిచేస్తుంది. 6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్‌ రేటుతో వస్తోంది. 800 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఉంది. స్నాప్‌డ్రాగన్‌ 7ఎస్‌ జనరేషన్‌ 2 ప్రాసెసర్‌తో వస్తోంది. డైనమిక్‌ ర్యామ్‌ ఫీచర్‌ ఇచ్చారు. దీంతో 24జీబీ వరకు ర్యామ్‌ను పొడిగించుకోవచ్చు. వెనకవైపు ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో కూడిన 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్‌ 890 సెన్సర్‌ ఇచ్చారు. 64 ఎంపీ ఓమ్నీ విజన్‌ OV64B సెన్సర్‌, 8 ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా ఇచ్చారు. ఈ ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ 120X డిజిటల్ జూమ్‌ సపోర్ట్‌తో వస్తోంది. సెల్ఫీల కోసం 32 ఎంపీ కెమెరా ఇచ్చారు. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 67W సూపర్‌వూక్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఇది 48 నిమిషాల్లోనే 0-100 శాతం బ్యాటరీని ఛార్జ్‌ చేస్తుంది.

ఇక రియల్‌మీ 12 ప్రో విషయానికొస్తే.. సాఫ్ట్‌వేర్‌, డిస్‌ప్లే పరంగా ప్రో+లో ఉన్న ఫీచర్లే ఇందులోనూ ఇస్తున్నారు. ఇందులో స్నాప్‌డ్రగన్‌ 6 జనరేషన్‌ 1 ప్రాసెసర్‌ అమర్చారు. 16 జీబీ వరకు డైనమిక్‌ ర్యామ్‌ సదుపాయం ఉంది. 50 ఎంపీ సోనీ ఐఎంక్స్‌ 882 ప్రధాన కెమెరా, 32 ఎంపీ సోనీ ఐఎంఎక్స్‌ 709 టెలీఫొటోలెన్స్‌, 8 ఎంపీ అల్ట్రా వైడ్‌ సెన్సర్‌ ఉంది. ముందువైపు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 67W సూపర్‌ వూక్‌ ఛార్జింగ్‌ సదుపాయం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు