Realme C51: భారత్‌లో రియల్‌మీ సీ51 విడుదల.. రూ.9,000తో 50MP కెమెరా!

Realme C51: రియల్‌మీ నుంచి సీ51 పేరిట మరో బడ్జెట్‌ ఫోన్‌ వచ్చింది. దీంట్లో కెమెరా ప్రత్యేక ఆకర్షణగా ఉంది. అలాగే మినీ క్యాప్సూల్‌ అనే ప్రత్యేక ఫీచర్‌ను కూడా ఇస్తున్నారు.

Published : 04 Sep 2023 17:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చైనా స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ రియల్‌మీ భారత్‌లో మరో బడ్జెట్‌ ఫోన్‌ను విడుదల చేసింది. రియల్‌మీ సీ51 (Realme C51)ను సోమవారం ఆవిష్కరించింది. కార్బన్‌ బ్లాక్‌, మింట్‌ గ్రీన్‌ రెండు రంగుల్లో ఇది అందుబాటులో ఉంది. దీంట్లో 5,000mAh బ్యాటరీని పొందుపర్చారు. దీంట్లో ప్రత్యేకంగా మినీ క్యాప్సూల్‌ ఫీచర్‌ను ఇస్తున్నారు. దీని ద్వారా బ్యాటరీ స్టేటస్‌, డేటా యూసేజ్‌, డైలీ స్టెప్స్‌ కౌంట్‌ను డిస్‌ప్లే నాచ్‌ పక్కన చిన్న క్యాప్సూల్‌లో చూడొచ్చు.

రియల్‌మీ సీ51 ధర (Realme C51 Price)..

రియల్‌మీ సీ51 (Realme C51) ఫోన్‌ 4GB RAM + 64GB స్టోరేజ్‌ వేరియంట్‌లో మాత్రమే లభిస్తోంది. దీని ధర రూ.8,999. ‘ఎర్లీ బర్డ్‌ సేల్‌’ కింద విక్రయాలు ఈరోజు (సెప్టెంబరు 4) సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభవుతున్నాయి. రియల్‌మీ.కామ్‌, ఫ్లిప్‌కార్ట్‌ సహా ఆఫ్‌లైన్‌ స్టోర్లలో అందుబాటులో ఉంటాయి. లాంఛ్‌ ఆఫర్‌ కింద హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేసేవారికి రూ.500 రాయితీ లభించనున్నట్లు కంపెనీ తెలిపింది.

రియల్‌మీ సీ51 ఫీచర్లు (Realme C51 Price Features)..

రియల్‌మీ సీ51లో 6.74 అంగుళాల హెచ్‌డీ తెర ఉంటుంది. దీని రిఫ్రెష్‌ రేటు 90Hz. ఆక్టార్‌ కోర్‌ Unisoc T612 ప్రాసెసర్‌ను ఇస్తున్నారు. 4GB ర్యామ్‌, 64GB స్టోరేజ్‌ ఉంటుంది. ర్యామ్‌ను మరో 4GB వరకు వర్చువల్‌గా విస్తరించుకునే వెసులుబాటు ఉంది. ఆండ్రాయిడ్‌ 13 ఔట్‌ ఆఫ్‌ బాక్స్‌ ఓఎస్‌తో వస్తోంది. 50MP ప్రధాన కెమెరాతో పాటు ముందు భాగంలో సెల్ఫీల కోసం 8MP కెమెరాను ఇస్తున్నారు. 33వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని పొందుపర్చారు. ఇది 4జీ వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుండడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు