100MP కెమెరాతో రియల్‌మీ నార్జో కొత్త ఫోన్‌.. ప్రైమ్‌డే సేల్‌లో భారీ డిస్కౌంట్‌!

Realme Narzo 60 5G, Narzo 60 Pro 5G full details: రియల్‌మీ సంస్థ నార్జో సిరీస్‌లో రెండు కొత్త ఫోన్లు లాంచ్‌ చేసింది. జులై 15 నుంచి వీటి విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

Updated : 06 Jul 2023 18:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ రియల్‌మీ నార్జో సిరీస్‌లో మరో రెండు 5జీ ఫోన్లను తీసుకొచ్చింది. నార్జో 60 5జీ (Narzo 60 5G), నార్జో 60 ప్రో 5జీ (Narzo 60 Pro) పేరిట వీటిని లాంచ్‌ చేసింది. ఈ రెండు ఫోన్లూ మీడియాటెక్‌ డిమెన్‌సిటీ ప్రాసెసర్‌తో వస్తున్నాయి. ఇందులో 60 ప్రో మోడల్‌ హై ఎండ్‌ వెర్షన్‌. దీంట్లో 100 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. రెండు ఫోన్లలోనూ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయం ఉంది. అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌లో కొనుగోలు చేసే వారికి భారీ డిస్కౌంట్‌ లభించనుంది.

రియల్‌మీ నార్జో 60 5జీ రెండు వేరియంట్లలో వస్తోంది. 8జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.17,999 కాగా.. 8జీబీ+ 256 జీబీ వేరియంట్‌ ధరను రూ.19,999గా నిర్ణయించారు. ఇక నార్జో 60 ప్రో 5జీలో మొత్తం మూడు వేరియంట్లు ఉన్నాయి. 8జీబీ+ 128జీబీ వేరింట్‌ ధర రూ.23,999గా నిర్ణయించగా.. 12జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.26,999గా కంపెనీ పేర్కొంది. 12జీబీ+ 1టీబీ వేరియంట్‌ ధరను రూ.29,999గా కంపెనీ నిర్ణయించింది. 
Also Read: అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌ తేదీలొచ్చాయ్‌.. ఈ కార్డులపై 10% డిస్కౌంట్‌

ఆఫర్లు, డిస్కౌంట్లు..

ఈ రెండు ఫోన్లూ జులై 15 నుంచి అమెజాన్‌లో అమ్మకానికి రాబోతున్నాయి. ఈ ఫోన్లు ప్రీ ఆర్డర్‌ చేసుకుంటే రూ.1000 కూపన్‌ లభిస్తుంది. 15, 16 తేదీల్లో అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌ జరుగుతుంది. ఆ సేల్‌లో ఈ మొబైల్‌ను ఐసీఐసీఐ బ్యాంక్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోలుపై రూ.1500 ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది. రియల్‌మీ వెబ్‌సైట్‌ ద్వారా కూడా కొనుగోలు చేయొచ్చు.

రియల్‌మీ నార్జో 60 5జీ స్పెసిఫికేషన్లు..

రియల్‌మీ నార్జో 60 5జీ స్మార్ట్‌ఫోన్‌.. 6.43 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో వస్తోది. ఇందులో 90Hz రిఫ్రెష్‌ రేటు ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత రియల్‌మీ యూఐ 4.0తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. మీడియాటెక్‌ డిమెన్‌సిటీ 6020 ప్రాసెసర్‌తో వస్తోంది. ఇందులో 8జీబీ వర్చువల్‌ ర్యామ్‌ కూడా ఉంటుంది. ఈ ఫోన్‌లో 64 ఎంపీ ప్రధాన కెమెరాతో పాటు వీడియో కాలింగ్‌ కోసం 16 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ 33W సూపర్‌వూక్‌ ఛార్జింగ్‌తో వస్తోంది. కాస్మిక్‌ బ్లాక్‌, మార్స్‌ ఆరెంజ్‌ రంగుల్లో ఈ ఫోన్‌ లభిస్తుంది. 

రియల్‌మీ నార్జో 60 ప్రో స్పెసిఫికేషన్లు

రియల్‌మీ నార్జో 60 ప్రోలో ఫుల్‌ హెచ్‌డీ+ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో వస్తోంది. ఇది ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత రియల్‌మీ యూఐ 4.0తో పనిచేస్తుంది. మీడియా టక్‌ డిమెన్‌సిటీ 7050 5జీ ప్రాసెసర్‌ను ఇందులో అమర్చారు. ఇందులో 12జీబీ డైనమిక్‌ ర్యామ్‌ లభిస్తుంది. వెనుక వైపు 100 మెగాపిక్సల్‌ ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌తో కూడిన కెమెరా ఇచ్చారు. ముందు వైపు 16ఎంపీ కెమెరా ఉంది. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్‌ 67W సూపర్‌ వూక్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. కాస్మిక్‌ నైట్‌, మార్టిన్‌ సన్‌రైజ్‌ కలర్‌ ఆప్షన్లతో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని