Realme Narzo: 5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్‌లో కొత్త ఫోన్లు

Realme Narzo: రియల్‌మీ మరో రెండు కొత్త ఫోన్లను విడుదల చేసింది. వీటి ధర రూ.11,999 నుంచి ప్రారంభమైంది. ఫీచర్లు, వేరియంట్లు, వాటి ధరలు, ఆఫర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..!

Published : 24 Apr 2024 15:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నార్జో 70 5జీ, నార్జో 70ఎక్స్‌ 5జీ ఫోన్లను రియల్‌మీ (Realme) బుధవారం భారత్‌లో విడుదల చేసింది. రెండూ 50 ఎంపీ కెమెరా, 5,000mAh బ్యాటరీ, 120Hz అమోలెడ్‌ డిస్‌ప్లేతో వస్తున్నాయి. ఇతర ఫీచర్లు, ధర, ఆఫర్లు ఎలా ఉన్నాయో చూద్దాం...!

రియల్‌మీ నార్జో 70 5జీ ఫీచర్లు, ధర..

ఈ ఫోన్‌ (Realme Narzo 70 5G) ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత రియల్‌మీ యూఐ 5.0 ఓఎస్‌తో పనిచేస్తుంది. మూడేళ్లు సెక్యూరిటీ అప్‌డేట్లు, రెండేళ్లపాటు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్లు అందిస్తుంది. 1,200 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 120Hz రీఫ్రెష్‌ రేటుతో 6.67 అంగుళాల తెరను ఇచ్చారు. మీడియాటెక్‌ డైమెన్సిటీ 7,050 ప్రాసెసర్‌ను అమర్చారు. వెనక 50ఎంపీ ప్రైమరీ సెన్సర్‌, f/1.8 అపెర్చర్‌, 2ఎంపీ సెన్సర్‌తో కూడిన కెమెరా సెటప్‌ ఇచ్చారు. సెల్ఫీల కోసం 16ఎంపీ కెమెరా ఉంది. 5జీ, వైఫై, బ్లూటూత్‌ 5.2 కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

45వాట్‌ సూపర్‌వూక్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ ఇచ్చారు. 61 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్‌ అవుతుందని కంపెనీ తెలిపింది. దీంట్లో రెండు వేరియంట్లు ఉన్నాయి. 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజ్‌ ధర రూ.15,999. 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ.16,999. ఐస్‌ బ్లూ, ఫారెస్ట్‌ గ్రీన్‌ రంగుల్లో ఫోన్‌ అందుబాటులో ఉంది. ఎర్లీ బర్డ్‌ సేల్‌ కింద ఏప్రిల్‌ 25న మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య కొనుగోలు చేసేవారికి రూ.1,000 డిస్కౌంట్‌ కూపన్‌ లభిస్తుంది.

రియల్‌మీ నార్జో 70ఎక్స్‌ 5జీ ఫీచర్లు, ధర..

ఈ ఫోన్‌లో (Realme Narzo 70X 5G) 120 రీఫ్రెష్‌ రేటు 6.72 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఇచ్చారు. మీడియాటెక్‌ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్‌ను పొందుపర్చారు. వెనక 50ఎంపీ ఏఐ కెమెరా, 2ఎంపీ మోనో కెమెరా, f/1.8 అపెర్చర్‌తో కూడిన కెమెరా సెటప్‌ను ఇచ్చారు. సెల్ఫీల కోసం 8ఎంపీ కెమెరా ఉంది. ఛార్జింగ్‌ స్టేటస్‌, బ్యాటరీ వార్నింగ్స్‌ చూపించేలా మినీ క్యాప్సూస్‌ 2.0 ఫీచర్ కూడా ఇచ్చారు. 45వాట్‌ సూపర్‌వూక్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని పొందుపర్చారు. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత రియల్‌మీ యూఐ 5.0 ఓఎస్‌తో పనిచేస్తుంది.

ఇది (Realme Narzo 70X 5G) కూడా రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 4GB ర్యామ్‌ + 128GB స్టోరేజ్‌ ధర రూ.11,999. 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.13,499. ఈరోజు (ఏప్రిల్‌ 24) సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య కొనుగోలు చేసేవారికి 4జీబీ వేరియంట్‌పై రూ.1,000, 6జీబీ వేరియంట్‌పై రూ.1,500 డిస్కౌంట్‌ కూపన్‌ లభిస్తుంది. ఇది కూడా ఐస్‌ బ్లూ, ఫారెస్ట్‌ గ్రీన్‌ రంగుల్లో అందుబాటులో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని