Realme Narzo N53: రియల్‌మీ కొత్త ఫోన్.. ₹9వేలకే ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయంతో!
Realme Narzo N53 Details: రియల్‌మీ కొత్త ఫోన్ తీసుకొచ్చింది. బడ్జెట్ ధరలో 4జీ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధర రూ.8,999 నుంచి ప్రారంభమవుతుంది.
ఇంటర్నెట్ డెస్క్: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ (Realme) బడ్జెట్ ధరలో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం, 50 కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లతో నార్జో N53 ఫోన్‌ను (Realme Narzo N53) గురువారం విడుదల చేసింది. నార్జో ఎన్ సిరీస్‌లో రియల్‌మీ తీసుకొచ్చిన రెండో ఫోన్ ఇది. తక్కువ ధరలో 4జీ ఫోన్ కోసం చూస్తున్న వారు దీనిని పరిశీలించొచ్చు.
రియల్‌మీ నార్జో ఎన్53 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో వస్తోంది. 4జీబీ+ 64జీబీ వేరియంట్ ధర రూ.8,999గా కంపెనీ నిర్ణయించింది. 6జీబీ+128జీబీ వేరియంట్ ధరను రూ.10,999గా పేర్కొంది. మే 24న మధ్యాహ్నం 12 గంటల నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డు హోల్డర్లు వెయ్యి రూపాయల వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఫస్ట్ సేల్‌లో 4జీబీ వేరియంట్‌ను రూ.500, 6జీబీ వేరియంట్‌ను రూ.1000 డిస్కౌంట్‌పై విక్రయిస్తున్నారు. మే 22న మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్య వెయ్యి రూపాయల వరకు డిస్కౌంట్‌తో స్పెషల్ సేల్ నిర్వహించనున్నట్లు రియల్‌మీ పేర్కొంది.
రియల్‌మీ నార్జో ఎన్ 53 ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.74 అంగుళాల డిస్‌ప్లే మర్చారు. 90Hz రిఫ్రెష్ రేటుతో ఈ డిస్‌ప్లే వస్తోంది. ఇందులో అక్టాకోర్ యునిసోక్ T612 ప్రాసెసర్‌ను అమర్చారు. ఆండ్రాయిడ్ 13తో పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ యూఐ 4.0తో వస్తోంది. వెనుకవైపు 50 ఎంపీ ప్రధాన కెమెరాతో ముందువైపు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. ఇందులో అమర్చిన 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కేవలం 30 నిమిషాల్లో 0-50 శాతం ఛార్జింగ్ అవుతుందని కంపెనీ చెబుతోంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్ ఉంటుంది. బ్లాక్, గోల్డ్ కలర్స్‌లో ఈ ఫోన్ లభిస్తుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Long Covid: దీర్ఘకాలిక కొవిడ్‌తో క్యాన్సర్‌ను మించి ఇబ్బందులు
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
Raghu Rama: నా వైద్య పరీక్షల నివేదికలను ధ్వంసం చేయబోతున్నారు
-
Ap-top-news News
Pradhan Mantri Matru Vandana Yojana: రెండో కాన్పులో అమ్మాయి పుడితే రూ.6వేలు
-
General News
Hyderabad News: చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం..
-
Ap-top-news News
అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే మార్గదర్శిపై దాడులు: కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్