Realme Pad2: 2k స్క్రీన్‌తో రియల్‌మీ ప్యాడ్‌.. ధర, ఫీచర్లు ఇవే..

Realme Pad2: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ రియల్‌మీ.. రియల్‌మీ ప్యాడ్‌ 2 పేరుతో కొత్త ప్యాడ్‌ను తీసుకొచ్చింది. దీని ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి.

Published : 19 Jul 2023 18:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ రియల్‌మీ (Realme) మరో కొత్త ట్యాబ్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. రియల్‌మీ ప్యాడ్‌ 2 (Realme Pad 2) పేరుతో మరో కొత్త ప్యాడ్‌ను యూజర్లకు పరిచయం చేసింది. రెండు వేరియంట్లలో ఈ ప్యాడ్ లభిస్తుంది. 8,360mAh బ్యాటరీతో పాటు 2k స్క్రీన్‌తో  రియల్‌మీ ప్యాడ్‌ వచ్చింది. అయితే దీని ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి.

రియల్‌మీ ప్యాడ్‌2 రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 6జీబీ+12జీబీ వేరియంట్ ధర రూ.19,999 కాగా, 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.22,999గా కంపెనీ నిర్ణయించింది. ఇన్‌స్పిరేషన్‌ గ్రీన్‌, ఇమాజినేషన్‌ గ్రే.. ఈ రెండు రంగుల్లో రియల్‌మీ ప్యాడ్‌ లభిస్తుంది. 11.5 అంగుళాల డిస్‌ప్లే 2k స్క్రీన్‌తో వస్తోంది. ఇది 120Hz రీఫ్రెష్ రేటింగ్‌ కలిగి ఉంది. 8,360mAh బ్యాటరీతో వచ్చే ఈ ప్యాడ్‌  33W SUPERVOOC ఫాస్ట్ ఛార్జర్‌కు సపోర్ట్‌ చేస్తుంది. 

ఇక కెమెరా విషయానికొస్తే.. ఇందులో 8 ఎంపీ కెమెరాతో పాటు టెక్ట్స్‌ స్కానింగ్ సదుపాయం ఉంటుంది. 17 గంటల వీడియో ప్లేబ్యాక్ 190 గంటల మ్యూజిక్‌ ప్లేబ్యాక్‌ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. దీంతో పాటు రెండు స్టీరియో స్పీకర్‌లను కూడా ఇస్తోంది. మల్టీ స్క్రీన్‌, స్క్రీన్ మిర్రరింగ్, డ్యుయల్‌ విండోస్‌, స్ల్పిట్ స్క్రీన్‌, స్మార్ట్ స్లైడ్‌బార్‌ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ నెల26 నుంచి ప్రీ బుకింగ్ ఆర్డర్లు మొదలవుతాయని కంపెనీ తెలిపింది. ఆగస్టు 1 నుంచి రియల్‌మీ వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటాయి.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని