Redmi A3: రెడ్‌మీ నుంచి ఎంట్రీ లెవల్‌ స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్లు ఇవే..!

Redmi A3: రెడ్‌మీ నుంచి మరో ఎంట్రీ లెవల్‌ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయ్యింది. ఏ3 పేరిట దీన్ని తీసుకొచ్చింది. ధర, ఇతర వివరాలు ఇవీ..

Published : 15 Feb 2024 01:38 IST

Redmi A3 launched | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎంట్రీ లెవల్‌లో స్మార్ట్‌ఫోన్‌ కోసం చూస్తున్న వారికి రెడ్‌మీ (Redmi) ఓ కొత్త ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. రెడ్‌మీ ఏ2కి కొనసాగింపుగా ఏ3ని (Redmi A3) తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్‌ గో (Go edition) ఎడిషన్‌తో వస్తున్న ఈ స్మార్ట్‌ మూడు కలర్‌ ఆప్షన్లు, మూడు స్టోరేజీ వేరియంట్లలో లభ్యమవుతుంది. ఈ ఫోన్‌ ధర, ఫీచర్లు, ఇతర వివరాలు ఇప్పుడు చూద్దాం..

రెడ్‌మీ ఏ3 (Redmi A3) 3జీబీ+64జీబీ వేరియంట్‌ ధర రూ.7,299గా కంపెనీ నిర్ణయించింది. 4జీబీ +128 జీబీ వేరియంట్‌ రూ.8,299కు, 6జీబీ+128జీబీ వేరియంట్‌ రూ.9,299కు లభ్యమవుతున్నాయి. మిడ్‌నైట్‌ బ్లాక్‌, లేక్‌ బ్లూ, ఆలివ్‌ గ్రీన్‌ రంగుల్లో లభిస్తుంది. ఫిబ్రవరి 23 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఫ్లిప్‌కార్ట్, ఎంఐ.కామ్‌, షావోమీ రిటైల్‌ స్టోర్లలో ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయి.

ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. ఇది ఆండ్రాయిడ్‌ 13 గో ఎడిషన్‌తో పనిచేస్తుంది. 6.71 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇచ్చారు. 90Hz రిఫ్రెష్‌ రేటుతో ఈ స్క్రీన్‌ పనిచేస్తుంది. వాటర్‌ డ్రాప్‌ స్టయిల్‌ నాచ్‌తో కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 3 ప్రొటెక్షన్‌తో వస్తోంది. ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ హీలియో జీ36 ప్రాసెసర్‌తో వస్తోంది. 12 జీబీ వరకు పెంచుకునేలా వర్చువల్‌ ర్యామ్‌ సదుపాయం ఉంది. వెనుకవైపు 8 ఎంపీ ఏఐ డ్యూయల్‌ కెమెరా, ముందువైపు 5 ఎంపీ కెమెరా ఇచ్చారు. 4జీ కనెక్టివిటీ, బ్లూటూత్‌ 5.0, సైడ్‌మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌, 3.5 ఎంఎం ఆడియో జాక్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 10W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని