Redmi Note 12: విడుదలైన వారంలో ₹ 300 కోట్ల విలువైన నోట్‌ 12 అమ్మకాలు!

రెడ్‌మీ నోట్‌ సిరీస్‌లో గత వారం కొత్త మోడల్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. విడుదలైన వారం రోజుల్లో ఈ ఫోన్ రికార్డు స్థాయిలో అమ్ముడైనట్లు కంపెనీ తెలిపింది. 

Published : 20 Jan 2023 18:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బడ్జెట్‌ ధరలో అత్యధిక ఫీచర్లతో ఫోన్‌ కొనాలంటే ఎక్కువ మంది రెడ్‌మీ ( Redmi) వైపే మొగ్గుచూపుతారు. షావోమి (Xiaomi) సబ్‌బ్రాండ్‌గా మార్కెట్లోకి అడుగుపెట్టి అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో బడ్జెట్‌ ధరలో స్మార్ట్‌ఫోన్లు (Smartphones) విడుదల చేస్తూ వినియోగదారులకు చేరువైంది. ముఖ్యంగా రెడ్‌మీ బ్రాండ్‌లో నోట్‌ (Redmi Note Series) సిరీస్‌ ఫోన్లు భారత్‌లో ఎక్కువగా అమ్ముడవుతుంటాయి. తాజాగా జనవరి 11న రెడ్‌మీ కంపెనీ నోట్‌ సిరీస్‌లో కొత్త మోడల్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. రెడ్‌మీ నోట్ 12 5జీ సిరీస్‌ (Redmi Note 12 5G Series) పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ భారత మార్కెట్లో రికార్డు స్థాయిలో అమ్ముడైంది. విడుదలైన వారంలో రోజుల్లో ₹ 300 కోట్ల విలువైన అమ్మకాలు జరిగినట్లు రెడ్‌మీ ఇండియా తెలిపింది. భారత మార్కెట్లో రెడ్‌మీ ఫోన్లకు దక్కుతున్న ఆదరణకు ఇది నిదర్శమని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. 

‘‘రెడ్‌మీ నోట్‌ సిరీస్‌ భారత మార్కెట్లోకి విడుదలై ఈ ఏడాదితో 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. నోట్‌ సిరీస్‌ను ఆదరిస్తున్న భారత యూజర్లకు ధన్యవాదాలు. రెడ్‌మీ నోట్‌ 12 5జీ సిరీస్‌ తీసుకొస్తున్నట్లు ప్రకటించిన తర్వాత సుమారు 80 లక్షల మంది ఈ మోడల్‌ కోసం ఆన్‌లైన్‌లో వెతికారు. విడులైన వారంలో ₹ 300 కోట్ల విలువైన అమ్మకాలు జరిగాయి. వినియోగదారులకు తక్కువ ధరలో అడ్వాన్స్‌డ్‌ ఫీచర్స్‌తో మెరుగైన ఉత్పత్తుల అందివ్వడమే మా  లక్ష్యం’’అని షావోమి ఇండియా చీఫ్‌ మార్కెటింగ్ ఆఫీసర్‌ అనూజ్ శర్మ తెలిపారు. 

రెడ్‌మీ నోట్‌ 12 5జీ సిరీస్‌లో మూడు వేరియంట్లు ఉన్నాయి. రెడ్‌మీ నోట్‌ 12 5జీ, రెడ్‌మీ నోట్‌ 12 ప్రో 5జీ, రెడ్‌మీ నోట్‌ 12 ప్రో+5జీ. వీటిలో రెడ్‌మీ నోట్‌ 12 5జీ వేరియంట్‌ ప్రారంభ ధర ₹ 18 వేలు. ఇక మిగిలిన రెండు మోడల్స్‌లో రెడ్‌మీ నోట్‌ 12 ప్రో 5జీ ధర ₹ 25 వేల నుంచి ప్రారంభమవుతుండగా.. రెడ్‌మీ నోట్ 12 ప్రో+ 5జీ ప్రారంభ ధర ₹ 30 వేలుగా ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని