Reliance drinks: రిలయన్స్‌ నుంచి మరిన్ని డ్రింక్స్.. శ్రీలంక కంపెనీతో జట్టు

ఎలిఫ్యాంట్ హౌస్‌ బ్రాండ్‌పై దేశీయంగా శీతల పానీయాల తయారీ, విక్రయాలు చేపట్టేందుకు రిలయన్స్‌ సంస్థ శ్రీలంకకు చెందిన కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది.

Updated : 28 Feb 2024 18:22 IST

Reliance | దిల్లీ: ప్రముఖ వ్యాపార సంస్థ రిలయన్స్‌ (Reliance).. తన ఎఫ్‌ఎంసీజీ వ్యాపారంపై మరింత దృష్టి పెట్టింది. శీతల పానీయాల విభాగంలో గతంలో కాంపా కోలా, సోస్యో వంటి బ్రాండ్లను తీసుకొచ్చిన ఈ సంస్థ.. ఇప్పుడు మరిన్ని డ్రింక్స్‌ను జోడించనుంది. శ్రీలంకకు చెందిన ఎలిఫ్యాంట్‌ హౌస్‌ (Elephant House) బ్రాండ్‌ శీతల పానీయాలను దేశీయంగా పరిచయం చేయనుంది. తద్వారా కోకా-కోలా, పెప్సీకి పోటీ ఇవ్వాలని భావిస్తోంది.

ఎలిఫ్యాంట్‌ హౌస్‌ బ్రాండ్‌ పేరుతో శీతల పానీయాల తయారీ, మార్కెట్‌, సరఫరా, రిటైల్‌ వ్యాపారం చేసుకోవడానికి ఆ కంపెనీతో రిలయన్స్‌ కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీనివల్ల రిలయన్స్‌ బేవరేజ్‌ ప్రొడక్ట్‌ పోర్ట్‌ఫోలియోను విస్తరించడమే కాకుండా.. కొత్త ఉత్పత్తులను భారతీయ వినియోగదారులకు అందించడం సాధ్యపడుతుందని రిలయన్స్‌ ఓ ప్రకటనలో పేర్కొంది.

యాప్‌లు అవసరం లేని స్మార్ట్‌ఫోన్‌.. పరిచయం చేసిన డాయిషే టెలికాం

రిలయన్స్‌ కొన్నాళ్లుగా ఎఫ్‌ఎంసీజీ వ్యాపారంపై దృష్టిపెట్టింది. ఇందులోభాగంగా దేశీయంగా పాపులర్‌ బ్రాండ్లను కొనుగోలు చేస్తూ వచ్చింది. కాంపా, సోస్యో హజూరీ వంటి శీతల పానీయ బ్రాండ్లతో పాటు.. లోటస్‌ చాక్లెట్స్‌, శ్రీలంకకు చెందిన మాలిబన్‌ బిస్కెట్‌ బ్రాండ్‌ను సైతం రిలయన్స్ కొనుగోలు చేసింది. ఇప్పుడు ఎలిఫ్యాంట్‌ బ్రాండ్‌ను తీసుకొచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. శ్రీలంకకు చెందిన సిలోన్‌ కోల్డ్‌ స్టోర్స్‌ పీఎల్‌సీ సంస్థ ఎలిఫ్యాంట్‌ హౌస్‌ బ్రాండ్‌ను నిర్వహిస్తోంది. నెక్టో, క్రీమ్‌ సోడా, ఈజీబీ (జింజర్‌ బీర్‌), ఆరెంజ్‌ బార్లీ, లెమనేడ్‌ పేరుతో శీతల పానీయాలను విక్రయిస్తోంది. ఈ ఒప్పందం ద్వారా ఈ ఫ్లేవర్లు మన దేశంలోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని