అత్యంత ప్రభావశీల 100 కంపెనీల్లో రిలయన్స్‌.. మరో రెండు భారతీయ సంస్థలు

Reliance Industries: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ అత్యంత ప్రభావశీల కంపెనీల జాబితాలో రెండోసారి చోటు దక్కించుకుంది.

Published : 30 May 2024 23:04 IST

Reliance Industries | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచంలోని అత్యంత ప్రభావశీల 100 కంపెనీల జాబితా (TIME 100 Most Influential Companies 2023)లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) చోటు దక్కించుకుంది. టైమ్‌ జాబితాలో కనిపించడం ఇది రెండోసారి. జియో ప్లాట్‌ఫామ్‌ ద్వారా డిజిట్‌ సేవలు అందిస్తున్న సంస్థ 2021లో ఈ జాబితాలో కనిపించింది. రిలయన్స్‌ను 'టైటాన్స్' కేటగిరీతో ఈ జాబితాలో చేర్చింది. రిలయన్స్‌ పాటు మరో రెండు భారతీయ కంపెనీలూ ఈ జాబితాలో నిలిచాయి.

58 ఏళ్ల క్రితం టెక్స్‌టైల్, పాలిస్టర్‌ కంపెనీగా ధీరూబాయి అంబానీ రిలయన్స్‌ను స్థాపించారు. తర్వాత తన వాటాను అందుకున్న ముకేశ్‌ అంబానీ కంపెనీను వృద్ధి పథంలో నడిపించారు. ప్రస్తుతం 200 బిలియన్ల కంటే ఎక్కువ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌తో దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా నిలిపారు. ఛైర్మన్ ముఖేష్ అంబానీ నాయకత్వంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేక రంగాల్లో అడుగుపెట్టింది. తన వ్యాపారాలను విస్తరించింది. ప్రపంచ స్థాయి ఉత్పత్తులు, సేవలను లక్షల మందికి అందుబాటులోకి తీసుకొచ్చింది. రిటైల్‌, ఇంధనం, టెలికమ్యూనికేషన్‌, రిఫైనింగ్‌ రంగం, రిటైల్‌, న్యూ ఎనర్జీ రంగాల్లో వెంచర్‌లను కలిగి ఉంది. రిలయన్స్‌ పౌండేషన్‌ను కూడా నడుపుతోంది.

లగ్జరీ నౌకలో అనంత్‌-రాధిక ప్రీవెడ్డింగ్‌.. సెకండ్‌ డే ‘టోగా పార్టీ’ స్పెషల్‌

రియలన్స్‌తో పాటు మరో రెండు భారత్‌ కంపెనీలు కూడా టైమ్‌ 100 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. టాటా గ్రూప్‌, సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా ఈ జాబితాలో ఉండటం విశేషం. ఈ ఏడాది టైమ్‌ 100 అత్యంత ప్రభావవంతమైన కంపెనీల జాబితా నాలుగో వార్షిక ఎడిషన్‌ విడుదల చేసింది. కంపెనీల ప్రభావం, ఆవిష్కరణ, ఆశయం, విజయం ఆధారంగా ఈ ర్యాకింగ్‌ను కేటాయిస్తుంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని