Reliance Jio Plan: స్పోర్ట్స్‌ ఫ్యాన్స్‌ కోసం జియో కొత్త ప్లాన్‌

Reliance Jio Plan: స్పోర్ట్స్‌ అభిమానులను దృష్టిలోఉంచుకొని రిలయన్స్‌ జియో కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది.

Updated : 22 May 2024 15:30 IST

Reliance Jio Plan | ఇంటర్నెట్‌ డెస్క్‌: రిలయన్స్‌ జియో మరో కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను (Reliance Jio Plan) తీసుకొచ్చింది. స్పోర్ట్స్‌ ఫ్యాన్స్‌ను దృష్టిలోఉంచుకొని దీన్ని రూపొందించింది. దీని ధర రూ.3,333. ఈ ప్యాక్‌ తీసుకున్నవారు క్రికెట్‌, ఫుట్‌బాల్‌, ఫార్ములా వన్‌ సహా ఇతర స్పోర్ట్స్‌ను వీక్షించొచ్చు. ఇతర ప్రయోజనాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

రిలయన్స్‌ జియో (Reliance Jio) రూ.3,333 ప్లాన్‌తో రోజుకు 2.5జీబీ డేటా, 100 ఎసెమ్మెస్‌లు, అపరిమిత కాలింగ్‌ లభిస్తాయి. దీని వ్యాలిడిటీ 365 రోజులు. జియోటీవీ మొబైల్‌ యాప్‌ ద్వారా ఫ్యాన్‌కోడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఈ ప్లాన్‌ ప్రత్యేకత. దీని గడువు కూడా ఏడాది. మామూలుగా అయితే ఫ్యాన్‌కోడ్‌ కోసం నెలకు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. వార్షిక ప్లాన్‌ అయితే రూ.999. అదే జియో కొత్త ప్లాన్‌తో ప్రత్యేకంగా చెల్లించాల్సిన అవసరం లేదు. దీంట్లో జియో సినిమా, జియోటీవీ, జియోక్లౌడ్‌ సభ్యత్వం కూడా పొందొచ్చు. జియోసినిమాలో ప్రీమియం కంటెంట్‌ను మాత్రం వీక్షించలేరు. యూజర్లు ఉచితంగా 5జీ డేటానూ పొందొచ్చు. జియో యాప్‌, అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఈ ప్లాన్‌ను రీఛార్జ్‌ చేసుకోవచ్చు.

రిలయన్స్‌ జియోలో రూ.2,999 వార్షిక ప్లాన్‌ కూడా రోజుకు 2.5జీబీ డేటా అందిస్తుంది. దీంట్లో కూడా దాదాపు రూ.3,333 ప్లాన్‌ ప్రయోజనాలే ఉంటాయి. ఫ్యాన్‌కోడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ మాత్రం లభించదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని