Jio Plans: ఈ పాపులర్‌ జియో ప్లాన్‌పై 20GB అదనపు డేటా

Jio Plans: కొన్ని ప్రీపెయిడ్‌ ప్లాన్లపై జియో అదనపు డేటా అందిస్తోంది. అవేంటి? వాటిలోని ఇతర ప్రయోజనాలు ఎలా ఉన్నాయో చూద్దాం!

Published : 15 Apr 2024 15:45 IST

Jio Plans | యూజర్ల అవసరాలకు అనుగుణంగా రిలయన్స్‌ జియో (Reliance Jio) ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్లను అందిస్తోంది. తాజాగా కొన్ని ప్లాన్లలో అదనపు డేటాను ఇస్తోంది. పైగా వీటన్నింటిలో అపరిమిత 5జీ డేటా ఉచితం. ఇంతకీ ఆ ప్లాన్లేంటి? వాటిలోని ఇతర ప్రయోజనాలెలా ఉన్నాయో చూద్దాం..!

రూ.398 ప్లాన్‌: వ్యాలిడిటీ 28 రోజులు. అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, రోజుకు 100 ఎసెమ్మెస్‌లు, 2జీబీ డేటా వంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్లాన్‌తో 6 జీబీ డేటా అదనంగా వస్తుంది. దీంట్లో జియో టీవీ, జియోక్లౌడ్‌ యాప్‌లతో పాటు సోనీలివ్‌, జీ5, జియో సినిమా ప్రీమియం, లయన్స్‌గేట్‌ ప్లే, డిస్కవరీ+, సన్‌నెక్ట్స్‌, చౌపల్‌, డాక్యుబే, ఎపిక్‌ ఆన్‌ వంటి ఓటీటీల సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తుంది.

రూ.749 ప్లాన్‌: దీని వ్యాలిడిటీ 90 రోజులు. దీంట్లో 20 జీబీ అదనపు డేటా లభిస్తుంది. అపరిమిత వాయిస్‌ కాలింగ్‌; రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, 2జీబీ డేటా ఉంటాయి. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌కి యాక్సెస్‌ వస్తుంది.

రూ.1,198 ప్లాన్‌: వ్యాలిడిటీ 84 రోజులు. ఎప్పటిలాగే అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, రోజుకు 100 ఎసెమ్మెస్‌లు, 2జీబీ డేటా ఉంటాయి. దీంట్లో 18 జీబీ అదనపు డేటా లభిస్తుంది. జియో టీవీ, జియో క్లౌడ్‌ యాప్‌లతో పాటు ప్రైమ్‌ వీడియో మొబైల్‌, డిస్నీ+ హాట్‌స్టార్‌, సోనీ లివ్‌, జీ5, జియో సినిమా ప్రీమియం, డిస్కవరీ+ సహా మొత్తం 14 ఓటీటీల సభ్యత్వం పొందొచ్చు.

రూ.4,498 ప్లాన్‌: దీని వ్యాలిడిటీ 365 రోజులు. అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు , 2జీబీ డేటా వస్తుంది. ఈ ప్లాన్‌తో 78 జీబీ అదనపు డేటా వస్తుండడం విశేషం. దీంట్లోనూ జియో టీవీ, జియో క్లౌడ్‌ యాప్‌లతో పాటు ప్రైమ్‌ వీడియో మొబైల్‌, డిస్నీ+ హాట్‌స్టార్‌, సోనీ లివ్‌, జీ5, జియో సినిమా ప్రీమియం, డిస్కవరీ+ సహా మొత్తం 14 ఓటీటీల సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని