Jio prepaid plans: జియో నుంచి న్యూఇయర్ ప్లాన్స్.. పూర్తి వివరాలు ఇవే!
Jio prepaid plans: రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది. కొత్తగా రూ.2023 ప్లాన్‌ను తీసుకురాగా.. ఇది వరకే ఉన్న రూ.2999 ప్లాన్‌లో కొన్ని మార్పులు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో (Reliance Jio) కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను (prepaid plans) తీసుకొచ్చింది. హ్యాపీ న్యూ ఇయర్ 2023 పేరిట (Jio happy new year offer) ఈ ప్లాన్లను లాంచ్ చేసింది. ఇందులో ఒకటి రూ.2023 విలువతో తీసుకురాగా.. ఇప్పటికే ఉన్న రూ.2999 ప్లాన్‌లో కొన్ని మార్పులు చేసింది. ప్లాన్, వ్యాలిడిటీ వివరాలు ఇప్పుడు చూద్దాం..
రూ.2023 ప్లాన్
2023 సంవత్సరాన్ని తెలియజేసే విధంగా రూ.2023 విలువతో రిలయన్స్ జియో ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. దీని వ్యాలిడిటీ 252 రోజులు. ఈ ప్లాన్ కింద రోజుకు 2.5 జీబీ మొబైల్ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్‌తో జియో యాప్స్ ఉచితంగా లభిస్తాయి. 28 రోజుల బిల్లింగ్ సైకిల్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. 9 బిల్లింగ్ సైకిల్స్‌తో ఈ ప్లాన్ సమానం. అంటే నెలకు రూ.225 చొప్పున పడుతుంది.
రూ.2999 ప్లాన్
జియో ఎప్పటి నుంచో ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తోంది. దీని కింద రోజుకు 2.5జీబీ డేటా చొప్పున మొత్తం 912.5 జీబీ డేటా లభిస్తుంది. రోజుకు వంద ఎస్సెమ్మెస్‌లు, అపరిమిత కాల్స్ లభిస్తాయి. మొత్తం 365 రోజుల వ్యాలిడిటీతో వస్తున్న ఈ ప్లాన్‌లో కొత్తగా కొన్ని మార్పులు చేశారు. ఏడాది వ్యాలిడిటీకి అదనంగా మరో 23 రోజుల అదనపు వ్యాలిడిటీని, 75జీబీ డేటాను జోడించారు. రిలయన్స్ జియోకు చెందిన ‘మై జియో’ యాప్‌తో పాటు ఇతర ఆన్‌లైన్ వేదికల ద్వారా రీఛార్జి చేసుకోవచ్చు. లాంగ్‌టర్మ్ ప్లాన్ కోసం చూస్తున్న వారు ఈ రెండు ప్లాన్లను పరిశీలించొచ్చు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Turkey- syria Earthquake: అద్భుతం.. మృత్యుంజయులుగా బయటకొచ్చిన చిన్నారులు
-
India News
Cheetah: అవి పెద్దయ్యాక మనల్ని తినేస్తాయి.. మన పార్టీ ఓట్లను తగ్గించేస్తాయి..
-
Sports News
IND vs AUS: మూడో స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌ని ఎంపిక చేయండి: రవిశాస్త్రి
-
Movies News
Kiara Sidharth Malhotra: ఒక్కటైన ప్రేమజంట.. ఘనంగా కియారా- సిద్ధార్థ్‌ల పరిణయం
-
Politics News
BJP: ప్రధాని మోదీపై రాహుల్ ఆరోపణలు నిరాధారం, సిగ్గుచేటు: రవిశంకర్ ప్రసాద్
-
World News
Turkey Earthquake: భూకంప విలయం.. రంగంలోకి శాటిలైట్లు!