పేటీఎం యూపీఐ ఐడీ సంగతి చూడండి.. NPCIని కోరిన ఆర్‌బీఐ

పేటీఎం యూపీఐ ఐడీ విషయంలో ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. పేటీఎంకు థర్డ్‌పార్టీ అప్లికేషన్‌ ప్రొవైడర్‌ స్టేటస్‌ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని ఎన్‌పీసీఐని ఆర్‌బీఐ కోరింది.

Published : 23 Feb 2024 18:33 IST

ముంబయి: పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై ఆంక్షలు విధించిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) పేటీఎం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. పేటీఎం యాప్‌లో యూపీఐ లావాదేవీలు నిర్వహించుకునేందుకు వీలుగా థర్డ్‌ పార్టీ అప్లికేషన్‌ ప్రొవైడర్‌ హోదా ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు (NPCI) సూచించింది. పేటీఎం మాతృ సంస్థ వన్‌ 97 కమ్యూనికేషన్‌ లిమిటెడ్‌ ఈమేరకు తమను అభ్యర్థించిందని పేర్కొంది. 

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌లో ‘@paytm’ ఐడీతో యూపీఐ లావాదేవీలు నిర్వహిస్తున్నవారు మున్ముందూ పేటీఎం యాప్‌లో డిజిటల్ చెల్లింపులు కొనసాగించే అంశాన్ని పరిశీలించాలని NPCIని ఆర్‌బీఐ కోరింది. ఇందుకోసం థర్డ్‌ పార్టీ అప్లికేషన్‌ ప్రొవైడర్‌ (TPAP) స్టేటస్‌ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలంది. ఒకవేళ ఆ హోదా లభిస్తే పేటీఎం మున్ముందూ యూపీఐ లావాదేవీలను ప్రాసెస్‌ చేసే వీలుంటుంది. అలాగే, @paytmను ఇతర బ్యాంకులకు మార్చుకునేందుకు వీలుగా అధిక మొత్తంలో లావాదేవీలు జరిపే సామర్థ్యం కలిగిన నాలుగైదు బ్యాంకులకు పేమెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ సర్టిఫికేషన్‌ ఇవ్వాలని కోరింది. 

పేటీఎం ఫాస్టాగ్‌లు ఏం చేయాలి? సౌండ్‌ బాక్స్‌ల మాటేంటి? RBI సమాధానాలివే..!

మరోవైపు ఇప్పటికీ ఎవరైతే పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ ఖాతాలు, ఫాస్టాగ్‌లు వాడుతున్నారో వారు మార్చి 15లోగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్‌బీఐ సూచించింది. ఒకవేళ క్యూఆర్‌ కోడ్‌లు వాడుతుంటే వారి అకౌంట్లను ఇతర పేమెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ బ్యాంక్స్‌తో వన్‌97 కమ్యూనికేషన్‌ సెటిల్‌ చేస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని