Retail inflation: 5 నెలల కనిష్ఠానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం

Retail inflation: దేశంలో రిటైట్‌ ద్రవ్యోల్బణం ఐదు నెలల కనిష్ఠానికి చేరినట్లు కేంద్ర గణాంకాల కార్యాలయం శుక్రవారం తెలిపింది. 

Published : 12 Apr 2024 20:45 IST

Retail inflation | దిల్లీ: దేశంలో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. ఆహార పదార్థాల ధరలు తగ్గడంతో వినియోగదారుల సూచీ ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం మార్చిలో 4.85 శాతంగా నమోదైంది. ఇది ఐదు నెలల కనిష్ఠం అని కేంద్ర గణాంకాల కార్యాలయం (NSO) శుక్రవారం తెలిపింది. అంతకుముందు ఫిబ్రవరి నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.09 శాతంగా ఉంది. అదే గతేడాది మార్చిలో 5.66 శాతంగా నమోదైంది. 2023 అక్టోబర్‌లో అత్యల్పం 4.87 శాతంగా ఉంది.

మరింత పెరిగిన బంగారం ధర.. రూ.75 వేల పైకి!

ఫిబ్రవరిలో 8.66 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం మార్చిలో 8.52 శాతానికి తగ్గిందని ఎన్‌ఎస్‌ఓ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతంగా ఉంటుందని రిజర్వ్‌ బ్యాంక్ అంచనా వేసింది. ఏప్రిల్‌ -జూన్‌ త్రైమాసికంలో 4.9 శాతంగా, సెప్టెంబర్‌ త్రైమాసికంలో 3.8 శాతంగా నమోదు కావొచ్చని పేర్కొంది. రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని 2- 6 శాతం మధ్య ఉంచే బాధ్యతను ప్రభుత్వం ఆర్‌బీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. దీంతో పరిస్థితులను బట్టి ఆర్‌బీఐ రెపో రేటును సవరిస్తూ వస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని