Sachin Bansal: ‘వారానికి 100 గంటలు పనిచేస్తానని నాపై ద్వేషం’: సచిన్‌ బన్సల్‌ వ్యాఖ్య

స్టార్టప్‌లకు ఇంటి నుంచి పని విధానం సరిపోదని సచిన్ బన్సల్ అన్నారు. అది తాత్కాలిక వెసులుబాటని చెప్పారు.

Updated : 03 Apr 2024 14:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ను విజయవంతంగా నడిపిన సచిన్‌ బన్సల్‌ (Sachin Bansal).. ప్రస్తుతం ఫిన్‌టెక్‌ స్టార్టప్‌ నవీ టెక్నాలజీస్‌ను అదేస్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారు. అందుకోసం బన్సల్‌ వారంలో ఎక్కువ గంటలు పనిచేస్తున్నారట. ఈ మేరకు ఆయన ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడారు.

స్టార్టప్‌లకు ఇంటి నుంచి పని విధానం సరిపోదని సచిన్ బన్సల్ అభిప్రాయడ్డారు. ‘‘ఆఫీస్‌ నుంచే విధులు నిర్వర్తించాలని మేం స్పష్టంగా  చెప్పాం. నా దృష్టిలో ఇంటి నుంచి పని విధానం అనేది ఒక తాత్కాలిక వెసులుబాటు. మేం 100 శాతం ఆఫీసు నుంచి పనిచేస్తున్నాం. నేను పూర్తిగా ఆఫీస్ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నాను. వారాంతాలు కూడా పనిచేస్తున్నాను. ఈ విషయంలో కొందరు నన్ను ద్వేషిస్తారు. అయితే అందరూ అలాగే పనిచేయాలని నేను అనుకోను. విశేష ఆదరణ ఉన్న వ్యాపార రంగం కోసం వారానికి 80 నుంచి 100 గంటలు కేటాయిస్తున్నాను. ఎందుకంటే చిన్నచిన్న విషయాలపై కూడా శ్రద్ధ పెట్టాల్సి ఉంది’’ అని సచిన్ బన్సల్ అన్నారు.

మన స్టాక్‌ మార్కెట్‌పై మదుపర్లలో ఆశావాదం

సచిన్‌.. నవీ సంస్థను 2018లో స్థాపించారు. కరోనా సమయంలో ఇంటి నుంచి పనిచేసేందుకు అవకాశం కల్పించిన ఈ సంస్థ.. తిరిగి ఉద్యోగులు కార్యాలయాలకు రావాలని స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు