Samsung Galaxy: శాంసంగ్‌ గెలాక్సీ ‘ఏ’ సిరీస్‌లో రెండు కొత్త ఫోన్లు.. ధర, ఫీచర్లివే!

Samsung Galaxy: శాంసంగ్‌ తమ గెలాక్సీ సిరీస్‌లో రెండు కొత్త ఫోన్లను విడుదల చేసింది. వీటి విక్రయాలు మార్చి 28 నుంచి ప్రారంభం కానున్నాయి. ముందే బుక్‌ చేసుకున్నవారికి ప్రత్యేక ఆఫర్లను ఇస్తున్నారు.

Published : 16 Mar 2023 19:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమ తాజా స్మార్ట్‌ఫోన్ సిరీస్ Galaxy A54 5G, Galaxy A34 5Gను శాంసంగ్‌ భారత్‌లో గురువారం విడుదల చేసింది. ప్రీమియం లుక్ అండ్ ఫీల్‌తో ఎక్కువ కాలం ఉండేలా వీటిని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. దీర్ఘకాల బ్యాటరీ లైఫ్‌, అత్యాధునిక ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫీచర్లు వీటిలో కస్టమర్లను ఆకట్టుకునే అంశాలని పేర్కొంది.

శాంసంగ్‌ గెలాక్సీ ఏ54 5జీ ప్రత్యేకతలు.. ధరలు..
(Samsung Galaxy A54 5G specs and price)

గెలాక్సీ ఏ54 5జీలో 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో కూడిన 6.4 అంగుళాల 1080 పిక్సెల్‌ అమోలెడ్‌ తెరను పొందుపర్చారు. తెరకు కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌5 రక్షణ ఉంది. Galaxy A54 5Gలో బ్యాక్‌ ప్యానెల్‌పై కూడా గొరిల్లా గ్లాస్‌5 ప్రొటెక్షన్‌ లభిస్తోంది. 25వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఎగ్జినోస్‌ 1380 ప్రాసెసర్‌ ఇస్తున్నారు. Galaxy A54 5G.. గ్రాఫైట్‌, లైమ్‌, వయొలెట్‌ రంగుల్లో అందుబాటులో ఉంది.

ఫ్లోటింగ్‌ కెమెరా, డివైజ్‌ కలర్‌తో మ్యాచ్‌ అయ్యే మెటల్‌ కెమెరా డెకో ఈ ఫోన్‌ డిజైన్‌లో ప్రత్యేక ఆకర్షణ. వెనుక భాగంలో మూడు సెన్సర్లతో కూడిన కెమెరా ఉంది. 50 ఎంపీ మెయిన్‌, 12 ఎంపీ అల్ట్రావైడ్‌, 5ఎంపీ మైక్రో కెమెరాను పొందుపర్చారు. ముందు భాగంలో సెల్ఫీల కోసం 32 ఎంపీ కెమెరాను ఇస్తున్నారు.

ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌, స్టిరీయో స్పీకర్ల సపోర్ట్‌తో డోల్‌బీ అట్మోస్‌, బ్లూటూత్‌ 5.3, యూఎస్‌బీ టైప్‌-సి వంటి ఫీచర్లు ఉన్నాయి. ధర విషయానికి వస్తే 8జీబీ+ 128 జీబీ వేరియంట్‌ ధర రూ.38,999. 8జీబీ + 256జీబీ ధర రూ.40,999.

శాంసంగ్‌ గెలాక్సీ ఏ34 5జీ ప్రత్యేకతలు.. ధరలు..
(Samsung Galaxy A34 5G: Price, Specs)

గెలాక్సీ ఏ34 5జీలో 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో కూడిన 6.6 అంగుళాల 1080X2400 పిక్సెల్‌ అమోలెడ్‌ తెరను అమర్చారు. మీడియా టెక్‌ డైమెన్సిటీ 1080 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను ఇస్తున్నారు. వెనుక భాగంలో 48 ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రావైడ్‌, 5ఎంపీ మైక్రో లెన్స్‌ కెమెరాలు ఉన్నాయి. ముందుభాగంలో సెల్ఫీల కోసం 13 ఎంపీ కెమెరా ఉంది. వాటర్‌, డస్ట్‌ రెసిస్టెన్స్‌, ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌ ఉన్నాయి. 25వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. 

ధరల (Galaxy A34 5G Price) విషయానికి వస్తే 8జీబీ + 128 జీబీ ధర రూ.30,999. 8జీబీ + 256జీబీ ధర రూ.32,999.

ఈ రెండు ఫోన్లను శాంసంగ్‌ ఎక్స్‌క్లూజివ్‌, పార్ట్‌నర్‌ స్టోర్లలో ఈఎంఐ ఆప్షన్‌తో కొనుగోలు చేయొచ్చు. అన్ని ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లలోనూ అందుబాటులో ఉంటాయి. 2023 మార్చి 28 నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయి. మార్చి 16 నుంచి మార్చి 27 వరకు ప్రీ ఆర్డర్‌ సేల్స్‌ కొనసాగనున్నాయి. ఇందులో బుక్‌ చేసుకున్న వారు రూ.999 విలువ చేసే బడ్స్‌ ఉచితంగా పొందొచ్చు. అలాగే వివిధ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.3000 వరకు క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు కూడా ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని