ఇన్ఫీని అధిగమించిన ఎస్‌బీఐ.. పీఎస్‌యూల్లోనూ అగ్రస్థానానికి..!

SBI: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ మార్కెట్ విలువ పరంగా సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఇన్ఫోసిస్‌ను అధిగమించింది.

Published : 22 Feb 2024 01:38 IST

SBI | ఇంటర్నెట్‌డెస్క్‌: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) మార్కెట్‌ విలువ పరంగా సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ (Infosys)ను అధిగమించింది. మార్కెట్‌ విలువ పరంగా దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థగానూ అవతరించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఈ షేరు ఇప్పటివరకు 20.5 శాతం పెరిగింది. 2021 ఫిబ్రవరిలో చివరిసారి 38.3 శాతం వృద్ధి సాధించింది.

గత వారంలో ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ (LIC) స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను (SBI) అధిగమించి మార్కెట్‌ విలువ పరంగా దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ (PSU)గా అవతరించింది. ఎల్‌ఐసీ షేర్లు 10 శాతం క్షీణించడంతో పీఎస్‌యూల్లో మరోసారి మొదటి స్థానంలో ఎస్‌బీఐ నిలిచింది. బుధవారం మార్కెట్‌ ముగిసే సమయానికి ఎస్‌బీఐ షేరు ఎన్‌ఎస్‌ఈలో ఎస్‌బీఐ షేరు 1.57 శాతం పెరిగి రూ.772.05 వద్ద స్థిరపడింది.

మార్కెట్ విలువ పరంగా చూస్తే.. రూ.20 లక్షల కోట్లతో రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) మొదటి స్థానంలో నిలిచింది. రూ.14.4 లక్షల కోట్లతో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) రెండు, రూ.10.9 లక్షల కోట్లతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC) మూడో స్థానంలో, రూ.7.4 లక్షల కోట్లతో ఐసీఐసీఐ బ్యాంక్‌ (ICICI) నాలుగో స్థానంలో ఉన్నాయి. రూ.6.89 లక్షల కోట్లతో ఐదో స్థానంలో ఎస్‌బీఐ నిలిచింది. టాప్‌ ఐదు జాబితాలో బ్యాంకింగ్‌ రంగానికి చెందిన స్టాక్‌లే ఆధిపత్యాన్ని చెలాయిస్తుండటం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని