SBI కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. UPIతో ఆ క్రెడిట్‌కార్డుల అనుసంధానం

ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు వినియోగదారులకు గుడ్‌న్యూస్‌. రూపే నెట్‌వర్క్‌పై పనిచేసే క్రెడిట్‌కార్డులను ఇకపై యూపీఐకు అనుసంధానం చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది.

Published : 10 Aug 2023 18:36 IST

దిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (SBI) క్రెడిట్‌కార్డు వినియోగదారులకు గుడ్‌న్యూస్‌. ఇకపై తమ రూపే నెట్‌వర్క్‌ క్రెడిట్‌ కార్డులను యూపీఐ సేవలకు అనుసంధానం చేసుకునే సదుపాయాన్ని ఎస్‌బీఐ అనుబంధ ఎస్‌బీఐ కార్డ్‌ (SBI Card) అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై స్కాన్‌ చేసి ఏదైనా కొనుగోలు చేసే సమయంలో క్రెడిట్‌కార్డులను వినియోగించుకోవచ్చు. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాతో (NPCI) కలిసి ఎస్‌బీఐ కార్డ్ ఈ సదుపాయాన్ని గురువారం ప్రారంభించింది.

యూపీఐ లైట్‌ లిమిట్‌ పెంపు.. ఇకపై 500 వరకు పాస్‌వర్డ్‌ అక్కర్లేదు

రూపే నెట్‌వర్క్‌పై పనిచేసే క్రెడిట్‌కార్డులను యూపీఐ యాప్స్‌తో అనుసంధానం చేసుకునే సదుపాయం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు బ్యాంకులు ఈ సదుపాయాన్ని ప్రారంభించాయి. థర్డ్ పార్టీ యాప్స్‌ సైతం ఈ ఫీచర్‌ను తమ యాప్స్‌లో జోడించాయి. తాజాగా ఎస్‌బీఐ కార్డ్‌ ఈ సేవలను ప్రారంభిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఉచితంగా ఈ సేవలను పొందొచ్చని పేర్కొంది. రోజూ కోట్లాది లావాదేవీలు జరుగుతున్న యూపీఐ నెట్‌వర్క్‌కు క్రెడిట్‌కార్డులు అనుసంధానం చేయడం ద్వారా వాటి వినియోగం మరింత పెరగనుందని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని