SBI market cap: ఎస్‌బీఐ @ ₹8 లక్షల కోట్లు.. తొలి ప్రభుత్వరంగ సంస్థగా అవతరణ

SBI market cap: ఎస్‌బీఐ మార్కెట్‌ విలువ రూ.8 లక్షల కోట్లు దాటింది. ఈ మైలురాయిని అందుకున్న తొలి ప్రభుత్వరంగ సంస్థ ఇదే.

Published : 03 Jun 2024 17:23 IST

SBI market cap | దిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) అరుదైన మైలురాయి సాధించింది. సోమవారం ఎస్‌బీఐ షేర్లు రాణించడంతో బ్యాంక్‌ మార్కెట్‌ విలువ (SBI market cap) ఒక్కసారిగా రూ.8 లక్షల కోట్లు దాటింది. ఈ ఘనత సాధించిన తొలి ప్రభుత్వరంగ సంస్థ ఎస్‌బీఐనే కావడం విశేషం. ఇంతకుముందు రిలయన్స్‌ ఇండ్ట్రీస్‌, టాటా కన్సల్టెన్సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ ఈ మైలురాయిని అందుకున్నాయి.

మోదీ 3.0 లోడింగ్‌.. సూచీలు ఫుల్‌ స్వింగ్‌..!

దేశంలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం రాబోతోందన్న ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలతో సోమవారం మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. ఈ క్రమంలోనే ఎస్‌బీఐ షేర్లు కూడా రాణించాయి. ఓ దశలో షేరు విలువ రూ.912 చేరగా.. చివరికి 9.48 శాతం లాభంతో 909.05 వద్ద ముగిసింది. ఈ క్రమంలోనే రూ.8 లక్షల కోట్ల మార్కెట్‌ విలువను ఎస్‌బీఐ అందుకుంది. 2021 సెప్టెంబర్‌ తర్వాత ఎస్‌బీఐకిదే అత్యధిక ఒక్కరోజు లాభం కావడం గమనార్హం. గత ఏడాదిలో షేరు విలువ 40 శాతం మేర పెరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని